మధురలోని శ్రీ కృష్ణ జన్మభూమి- షాహి ఈద్గా వివాదం కేసులో హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. హిందూ పక్షం దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. మసీదును వివాదాస్పద నిర్మాణంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. ఈ నిర్ణయం హిందూ పక్షానికి ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. జస్టిస్ రామ్ మనోహర్ నారాయణ్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు పేర్కొంది.
వక్ఫ్ (సవరణ) చట్టం-2025 రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన 72 పిటిషన్లపై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా వక్ఫ్‌పై సమాధానం ఇచ్చేందుకు కేంద్రం వారం గడువు కోరగా.. న్యాయస్థానం అందుకు అంగీకరించింది. కాగా.. సవరణలోని వివిధ అంశాలకు సంబంధించి పిటిషన్లలో అనేక ప్రశ్నలు లేవనెత్తారు. ఈ అంశపై తాజాగా వక్ఫ్ చట్టంపై ప్రశ్నలు లేవనెత్తే వారి కోసం ఏర్పాటు చేసిన పార్లమెంటరీ జాయింట్ కమిటీ (జెపిసి) ఛైర్మన్ జగదాంబికా పాల్ స్పందించారు.ఈ చట్టంలో ఒక్క…
వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది. పూర్తి వివరణ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం వారం రోజుల గడువు కోరింది. కేంద్రం కోరిక మేరకు సుప్రీం గడువు ఇచ్చింది. ఈ కేసులో సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వక్ఫ్ బోర్డులో కొత్త నియామకాలు చేయొద్దని ఆదేశించింది. వారం రోజుల్లో పిటిషనర్లు లేవనెత్తిన అంశాలపై కేంద్రం అఫిడవిట్ దాఖలు చేయాలని సూచించింది. వక్ఫ్ ఆస్తులలో ఎలాంటి మార్పు చేయవద్దని.. వక్ఫ్ ,వక్ఫ్ బై యూజర్ ఆస్తులను డీ నోటిఫై…
Live-in Relationship: మధ్యప్రదేశ్ హైకోర్టు లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌కి సంబంధించిన పిటిషన్‌పై కీలక తీర్పు ఇచ్చింది. పెద్దలు పెళ్లి చేసుకోకుండా కలిసి జీవించేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ కేసులో తీర్పును జస్టిస్ సుబోధ్ అభ్యంకర్ సింగిల్ బెంచ్ ఇచ్చారు. పిటిషనర్లిద్దరికీ 18 ఏళ్లు పైబడిన వారేనని, వారు స్వేచ్చగా తమ ఇష్టానుసారంగా జీవించే హక్కు ఉన్నాయని కోర్టు పేర్కొంది. ఇకపై బయటి వారి జోక్యం నుంచి ఈ హక్కును కాపాడుకోవాలని కూడా కోర్టు స్పష్టం చేసింది. కానీ,…