‘‘స్పేస్‌లో పరిస్థితులకు ఇప్పుడే అలవాటు పడుతున్నాం. అంతరిక్షంలో ఎలా నడవాలి, ఎలా తినాలి అనే విషయాలను చిన్నపిల్లాడిలా నేర్చుకుంటున్నాను. ఇక్కడున్న ప్రతీ క్షణాన్ని ఆస్వాదిస్తున్నాను. ఈ ప్రయాణంలో నేను ఒంటరి కాను.. నా భూజంపై త్రివర్ణ పతాకం ఉంది. అంటే.. కోట్లాది మంది భారతీయులు నాకు తోడుగా ఉన్నారనే భావన నాకు కలుగుతోంది. రోదసియానంలో నాది చిన్న అడుగే కావొచ్చు. కానీ, భారత మానవ సహిత అంతరిక్ష యాత్రలకు ఘనమైన ముందడుగు." అని శుభాంశు వ్యాఖ్యానించారు.
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్)లో అడుగుపెట్టిన మొట్ట మొదటి భారతీయుడిగా శుభాంశు శుక్లా రికార్డుకెక్క బోతున్నాడు. స్పేస్‌ఎక్స్(SpaceX) సంస్థ అభివృద్ధి చేసిన డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్‌కు పైలట్‌గా వ్యవహరించబోతున్న విషయం తెలిసిందే. ఇందుకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా అనుమతి కూడా ఇటీవల లభించింది.
ISRO: భారతదేశం అంతరిక్ష పరిశోధనలో మరో చారిత్రాత్మక విజయం సాధించింది. ఇండియన్ స్పేస్ రీసర్చ్ ఆర్గనైజేషన్ (ISRO) స్పాడెక్స్ మిషన్ ను విజయవంతం చేసి రికార్డు సృష్టించింది. ఈ మిషన్ ద్వారా ఇస్రో తొలిసారిగా భూకక్ష్యలో రెండు ఉపగ్రహాలను విజయవంతంగా ప్రవేశపెట్టింది. ఇది భారతదేశానికి గర్వకారణం. ఎందుకంటే.. అమెరికా, రష్యా, చైనా తర్వాత ఈ ఘనత సాధించిన నాలుగో దేశంగా భారతదేశం అవతరించింది. గత ఆదివారం, స్పాడెక్స్ ఉపగ్రహాలు చెజర్, టార్గెట్ ఒకదానికొకటి దగ్గరగా చేరడం ద్వారా…