ENG vs IND: ఇంగ్లాండ్ గడ్డపై టీమిండియా గ్రాంఢ్ విక్టరీ సాధించింది. అండర్సన్ - టెండూల్కర్ ట్రోఫీలో భాగంగా జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో భారత్ 336 పరుగుల తేడాతో గెలిచింది.
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కోసం ఐసీసీ... మ్యాచ్ అఫిషియల్స్ ను ప్రకటించింది. న్యూజిలాండ్‌కు చెందిన క్రిస్ గఫానీ, ఇంగ్లాండ్‌కు చెందిన రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్‌లను ఆన్-ఫీల్డ్ అంపైర్లుగా నియమించారు.
ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్లో జరిగిన ఉగ్ర దాడిలో 28 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో భారతీయులు పాక్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు తెలియజేస్తున్నారు. అదే సమయంలో, పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది సిగ్గుచేటు పని చేశాడు. పహల్గామ్ దాడిపై రక్తం మరిగే వ్యాఖ్యలు చేశాడు. ఉగ్ర దాడిని ఖండించడానికి బదులుగా, అఫ్రిది భారతదేశాన్ని ఆధారాలు అందించమని కోరాడు. వైరల్ అయిన ఓ…
పృథ్వీ షా కెరీర్ పై పంజాబ్ కింగ్స్ క్రికెటర్ శశాంక్ సింగ్ పృథ్వీ షా కెరీర్‌ను తిరిగి గాడిలో పెట్టుకోవడానికి సలహా ఇచ్చాడు. శశాంక్ సింగ్ ఈ సలహాను శుభంకర్ మిశ్రాతో జరిగిన పాడ్‌కాస్ట్‌లో పంచుకున్నారు.
మార్చి 18 అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో ఒక ప్రత్యేకమైన రోజు. టీమిండియాకు ఈరోజు చాలా చిరస్మరణీయమైనది. మార్చి 18.. ముగ్గురు దిగ్గజ క్రికెటర్లు తమ చివరి వన్డే మ్యాచ్ ఆడారు. వారిలో క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్, శ్రీలంక మాజీ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ కుమార్ సంగక్కర, మాజీ కెప్టెన్ మహేల జయవర్ధనే ఉన్నారు.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025ని టీమిండియా కైవసం చేసుకుంది. టీమిండియా తాజా గెలుపుతో మరో ట్రోఫీని ఖాతాలో వేసుకుంది. విజయనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ.. శ్రేయాస్ అయ్యర్‌ను సైలెంట్ హీరో అని వ్యాఖ్యానించాడు. 2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ విజయంలో టీమిండియాకు సైలెంట్ హీరోగా నిలిచిన ఆటగాడిగా రోహిత్ శర్మ శ్రేయాస్ అయ్యర్‌ను సెలక్ట్ చేశాడు. అతని గురించి ఎక్కువ మాట్లాడ లేకపోయినా.. అతను తన పనిని పూర్తి అంకితభావంతో చేశాడని రోహిత్ శర్మ తెలిపాడు.
న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్‌లో భారత్ ప్లేయింగ్ ఎలెవన్‌లో మార్పులు చేయాలని మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ సూచించాడు. ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్‌కు అవకాశం ఇవ్వాలని తెలిపాడు.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా.. ఆదివారం భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య హైఓల్టేజ్ మ్యాచ్ జరుగనుంది. ఈ ఆసక్తికర పోరు కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. అటు.. క్రికెట్ అభిమానులతో పాటు, మాజీ క్రికెట్ దిగ్గజాలు, ప్రముఖులు, సెలబ్రిటీలు ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తన అభిప్రాయాన్ని తెలిపారు. ఐసీసీ టోర్నమెంట్లలో పాకిస్తాన్‌పై భారత్ అద్భుతమైన రికార్డును కొనసాగిస్తుందని గంగూలీ ఆశాభావం వ్యక్తం చేశారు.
2025 ఛాంపియన్స్ ట్రోఫీని టీమిండియా విక్టరీతో మొదలు పెట్టింది. టోర్నమెంట్‌లోని రెండవ మ్యాచ్‌లో ఇండియా, బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా బంగ్లాదేశ్‌ను 6 వికెట్ల తేడాతో ఓడించింది. కాగా.. భారత్ తన రెండవ మ్యాచ్‌లో తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం రెండు దేశాల అభిమానులతో పాటు.. ఇతర దేశాల అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.