భారత్, కెనడాల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. కెనడాలో సిక్కు నేత హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో అక్కడి భారత రాయబారి ప్రమేయం ఉందని ఆ దేశం ఆరోపించింది. ఇందుకు బలమైన ఆధారాలు సమర్పించాలని భారత్ కోరింది. ఇప్పటికే దానికి సంబంధించిన ఆధారాలన్నీ ఇచ్చేశామంటోంది కెనడా. అసలు కెనడాకు, ఇండియాకు మధ్య గ్యాప్ ఎందుకొచ్చిందనే విషయం తెలియాలంటే చరిత్రలోకి వెళ్లాలి.. భారత్, కెనడా మధ్య దౌత్య సంబంధాలు పూర్తిగా దిగజారిపోయాయి. కెనడా దౌత్య సిబ్బందిని భారత్…
India-Canada Conflict: కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో పాపులారిటీ అక్కడ రోజురోజుకు పడిపోతోంది. మరోవైపు ప్రభుత్వంపై కొందరు ఎంపీలు అసమ్మతి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వీటిన్నింటి పక్కకు తప్పించి, మరోసారి సిక్కులు, సిక్కు ఎంపీల మద్దతు పొందేందుకు ఖలిస్తానీ హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యని ముందుకు తీసుకువచ్చారు. ఈ కేసులో కెనడాలోని భారత అగ్రశ్రేణి దౌత్యవేత్తల ప్రమేయం ఉన్నట్లు ఆరోపించడంతో ఒక్కసారిగా ఇరు దేశాల మధ్య దౌత్యయుద్ధం మొదలైంది. భారత్ ఇప్పటికే…