Canada: కెనడాలో ఖలిస్తానీ వేర్పాటువాడులు బరితెగిస్తున్నారు. భారత్ రాయబార కార్యాలయాన్ని ముట్టడించాలని పిలుపునిచ్చారు. అమెరికాకు చెందిన ‘‘సిఖ్ ఫర్ జస్టిస్(SFJ)’’ వాంకోవర్‌లోని భారత కాన్సులేట్‌ను ముట్టడిస్తామని బెదిరింపులకు పాల్పడింది. భారత కాన్సులేట్‌ను గురువారం స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించింది. ఇండో కెనడియన్లు తమ సాధారణ పనుల కోసం కాన్సులేట్‌కు వచ్చే వారు వేరే తేదీని ఎంచుకోవాలని కోరింది.
Canada: ఖలిస్తానీ ఉగ్రవాదులకు, వారి సంస్థలకు కెనడా ప్రభుత్వం ఎప్పటి నుంచో మద్దతుగా నిలుస్తుందో అందరికి తెలిసిన బహిరంగ రహస్యం. జస్టిన్ ట్రూడో ప్రధానిగా ఉన్న సమయంలో, ఖలిస్తానీ ఉగ్రవాదుల కోసం భారతదేశంతో ఉన్న దౌత్య సంబంధాలను కూడా రిస్క్‌లో పెట్టాడు. అయితే, తొలిసారిగా, కెనడా నిజాన్ని ఒప్పుకుంది.
India Canada: కెనడా ఇప్పుడిప్పుడే దారికి వస్తోంది. గతంలో, జస్టిన్ ట్రూడో ప్రధానిగా ఉన్న సమయంలో ఖలిస్తానీ వేర్పాటువాదులకు మద్దతుగా నిలిచాడు. తన రాజకీయాల కోసం భారత్‌తో సంబంధాలను పణంగా పెట్టాడు. ప్రస్తుతం, మార్క్ కార్నీ ప్రధానిగా గెలిచిన తర్వాత భారత్‌తో కెనడా సంబంధాలు మెరుగుపడుతున్నాయి. జీ -7 సమావేశానికి ప్రధాని నరేంద్రమోడీని కెనడా ఆహ్వానించింది. స్వయంగా కెనడా ప్రధాని కార్నీ మోడీకి ఫోన్ చేశారు.
G7 Summit: కెనడాలోని ఆల్బెర్టాలో జూన్ 15-17 వరకు జరుగబోతున్న G7 శిఖరాగ్ర సమావేశానికి ప్రధాని నరేంద్రమోడీని, కెనడా ప్రధాని మార్క్ కార్నీ ఆహ్వానించారు. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య తర్వాత ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తత నేపథ్యంలో, ప్రధాని నరేంద్రమోడీకి ఆహ్వానం రాకపోవడమో లేక ఆయనే ఈ సమావేశానికి వెళ్లకపోవడమో జరుగుతుందని అందరూ అంచనా వేశారు. అయితే, శుక్రవారం కార్నీ స్వయంగా మోడీకి ఫోన్ చేసి సమావేశాలకు రావాలని కోరారు. ఆయన…
PM Modi: కెనడాలో జరిగే జీ-7 శిఖరాగ్ర సమావేశానికి ప్రధాని నరేంద్రమోడీ వెళ్లడం లేదని తెలుస్తోంది. జీ-7 అనేది ప్రపంచంలోని అత్యంత పారిశ్రామిక ఆర్థిక వ్యవస్థలైన ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, యునైటెడ్ కింగ్‌డమ్, జపాన్, యునైటెడ్ స్టేట్స్, కెనడాల కూటమి. అయితే, ఈ సమావేశాలకు యూరోపియన్ యూనియన్(ఈయూ), ప్రపంచబ్యాంక్, ఐఎంఎఫ్, ఐక్యరాజ్యసమితికి ఆహ్వానాలు అందాయి.
Disrespect Indian Flags: ఖలిస్తాన్ అనుకూల కార్యకర్తలు వాంకోవర్‌లోని భారత దౌత్య కార్యకలాపాలు, చిహ్నాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేశారు. దీంతో కెనడా- భారతదేశం మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచారు.
ఖలిస్తాన్ సమస్యపై గతేడాది నుంచి భారత్- కెనడాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇక, కెనడియన్ పార్లమెంటరీ కమిటీ నివేదికతో ఈ సంబంధాలలో మరింత ఉద్రిక్తతను సృష్టించాయి.
India-Canada Tensions: ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హతమైన కారణంగా భారత్, కెనడాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత తారాస్థాయికి చేరుకుంది.