Disrespect Indian Flags: ఖలిస్తాన్ అనుకూల కార్యకర్తలు వాంకోవర్‌లోని భారత దౌత్య కార్యకలాపాలు, చిహ్నాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేశారు. దీంతో కెనడా- భారతదేశం మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచారు. ఈ ఖలిస్తాన్ ఉగ్రవాదులు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను తన్నడంతో పాటు భారత జాతీయ జెండాలను కాలుతో తొక్కుతూ చింపేశారు. కెనడాలోని అన్ని భారతీయ కాన్సులేట్‌లను బంద్ చేయాలని డిమాండ్ చేశారు.
Read Also: Bandi Sanjay: నేను కేంద్ర మంత్రినైనా మీకోసం రోడ్డెక్కుతున్న.. గ్రూప్ 1 అభ్యర్థులతో బండి సంజయ్..
అయితే, హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య తర్వాత కెనడా- భారతదేశం మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ హత్యలో తమ ప్రమేయం లేదని భారతదేశం తీవ్రంగా ఖండించింది. అయితే, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలు రెండు దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక సంబంధాలను మరింత దెబ్బతీశాయి. తాజాగా, వాంకోవర్‌లో ఇటీవల ఖలిస్తాన్ అనుకూల కార్యకర్తలు భారత జాతీయ జెండాతో పాటు ప్రధాని మోడీ ఫోటోలను చింపివేయడంతో తీవ్ర వివాదం కొనసాగుతుంది.
Read Also: Satyendar Jain: జైలు నుంచి బయటకు వచ్చి జైన దేవాలయం దర్శించిన జైన్ దంపతులు
ఇక, ఖలిస్థాన్ ఉగ్రవాదులు చేస్తున్న సంఘటనలతో కెనడియన్ అధికారులకు పెను సవాల్ గా మారింది. సిక్కు డయాస్పోరాలోని విభాగాలలోని తీవ్రవాద మూలకాల ప్రభావాన్ని అరికట్టడానికి కెనడియన్ అధికారులు కష్టపడుతున్నారు. భారతదేశంలో ప్రత్యేక సిక్కు మాతృభూమిని స్థాపించాలని కోరుతూ ఖలిస్తాన్ ఉద్యమంతో పాటు భారత్ సహా విదేశాల్లోని కొన్ని సమూహాల మధ్య చాలా కాలంగా ఘర్షణ కొనసాగుతుంది.
It makes my blood boil to see this disrespect of the Tiranga.
GoI should identify these people, and if any of them hold Indian citizenship, they should never be allowed to return… These clowns are worse than Jihadis.. pic.twitter.com/ECcVtRoHHE
— Mr Sinha (@MrSinha_) October 19, 2024