Bangladesh: బంగ్లాదేశ్ జాతీయ భద్రతా సలహాదారు (NSA) ఖలీలూర్ రెహమాన్ ఈరోజు న్యూఢిల్లీలో భారత NSA అజిత్ దోవల్‌ను కలిశారు. షేక్ హసీనాను అప్పగింత వ్యవహారంపై ఇప్పటికే భారత్, బంగ్లాల మధ్య సంబంధాలు దెబ్బతింటున్న నేపథ్యంలో ఈ మీటింగ్‌కు ప్రాధాన్యత ఏర్పడింది. రెండు దేశాల మధ్య సంబంధాలు సున్నితంగా మారిన ఈ సమయంలో అజిత్ దోవల్ ఢాకాలో పర్యటించాల్సిందిగా రెహమాన్ ఆహ్వానించారు. కొలంబో భద్రతా కాన్‌క్లేవ్ యొక్క 7వ NSA సమావేశంలో ఇద్దరు నాయకులు సమావేశమయ్యారు.
India Bangladesh: బంగ్లాదేశ్‌కి భారత్ భారీ షాక్ ఇచ్చింది. బంగ్లాదేశ్ నుంచి భారత్‌లోకి దిగుమతి అవుతున్న కొన్ని వస్తువులపై పోర్టు ఆంక్షలు విధించారు. ఆ దేశం నుంచి రెడీమెడ్ దుస్తులు, ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాల వంటి కొన్ని దిగుమతులపై ఆంక్షలు పెట్టింది. వాణిజ్య మంత్రిత్వ శాఖ పరిధిలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (DGFT) ఈ విషయంపై నోటిఫికేషన్ జారీ చేసింది. బంగ్లాదేశ్ వస్త్ర దిగుమతులను కోల్‌కతా, ముంబై ఓడరేవులకు వరకే పరిమితం చేసింది.…
PM Modi: బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి మహ్మద్ యూనస్, భారత ప్రధాని నరేంద్రమోడీతో భేటీ అయ్యారు. థాయ్‌లాండ్ బ్యాంకాక్‌లో 6వ బిమ్‌స్టెక్ శిఖరాగ్ర సమావేశంలో ఇరువురు నాయకులు సమావేశమయ్యారు. రెండు దేశాల మధ్య సానుకూల, నిర్మాణాత్మక సంబంధం అవసరారన్ని ప్రధాని మోడీ యూనస్‌కి తెలియజేశారు. అదే సమయంలో పర్యావరణాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడటాన్ని నివారించాలని కోరారని విదేశాంగ మంత్రి విక్రమ్ మిస్రీ విలేకరుల సమావేశంలో చెప్పారు.
డిసెంబర్ 03 రాత్రి మంగ్లార్‌గావ్, మోనిగావ్ ఈస్ట్ గునిగ్రామ్‌లలో హిందూ సమాజానికి చెందిన వారిపై గుంపు దాడికి పాల్పడింది. 100 కన్నా ఎక్కువ ఇళ్లు, వ్యాపారాలపై దాడి చేశారు. షాపుల్ని లూటీ చేశారు. ఒక ఆలయాన్ని కూడా ధ్వంసం చేశారు. మొత్తం 1.5 మిలియన్ టాకా( రూ. 10లక్షల)కు పైగా నష్టం వాటిల్లినట్లు కౌన్సిల్ వెల్లడించింది.
India On Bangladesh: బంగ్లాదేశ్‌లో మైనారిటీలు, ముఖ్యంగా హిందువులపై దాడులు, అణిచివేతపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. పొరుగు దేశంలో పెరుగుతున్న హింసాత్మక సంఘటనలపై బంగ్లాదేశ్‌కి తన తీవ్రమైన ఆందోళనని తెలిజేసింది.