Pakistan: పాకిస్తాన్ భారత్‌కి వ్యతిరేకంగా కొత్త కుట్రలకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ‘‘ఆపరేషన్ సిందూర్’’తో చావు దెబ్బలు తిన్నా కూడా తన పంథాను మార్చుకోవడం లేదు. తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం, పాకిస్తాన్ ఆర్మీ, లష్కరే తోయిబా ఉగ్రవాదులు పాక్ ఆక్రమిక కాశ్మీర్(పీఓకే)లోని నియంత్రణ రేఖను సందర్శించినట్లు తెలుస్తోంది.
Shahid Afridi: భారత్ చేతిలో చావు దెబ్బలు తిన్నా కూడా పాకిస్తాన్ తమకు ఏం కాలేదని చెప్పుకునే ప్రయత్నం చేస్తోంది. పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్‌తో పాటు ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ విజయోత్సవాలకు హాజరవుతున్నారు. భారత ‘‘ఆపరేషన్ సిందూర్’’ దాడుల్లో పాకిస్తాన్ 11 ఎయిర్ బేస్‌లు ధ్వంసమయ్యాయి. పీఓకే, పాక్ భూభాగాల్లోని 9 ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసి, 100 మందిని హతమార్చింది. అయినా కూడా ఏం జరగనట్లు పాకిస్తాన్ తన ప్రజల్ని మోసం చేస్తోంది.
India Pakistan: ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ పాకిస్తాన్ నుంచి వచ్చే డ్రోన్లను విజయవంతంగా అడ్డుకుంది. భారత్ వద్ద ఉన్న ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు అత్యంత సమర్థవంతంగా పనిచేశాయి. భారత వాయు రక్షణ వ్యవస్థలు 600 కంటే ఎక్కువ పాకిస్తానీ డ్రోన్లను కుప్పకూల్చాయి. అంతర్జాతీయ సరిహద్దు(ఐబీ) వద్ద 1000 కంటే ఎక్కువ యాంటీ-ఎయిర్ క్రాఫ్ట్ గన్స్‌ని భారత్ మోహరించింది.
India Pakistan: ఎట్టకేలకు పాకిస్తాన్ క్రమంగా నిజాలను ఒప్పుకుంటోంది. తమపై భారత్ దాడి చేయలేదని, దాడి జరిగినా, పాకిస్తాన్ ఆర్మీ తిప్పికొట్టింది అంటూ విజయోత్సవాలు చేసుకున్న ఆ దేశ నేతలు నిజాలను వెల్లడిస్తున్నారు. తాజాగా, తమపై భారత్ క్షిపణులతో దాడులు చేసిందని, పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ అన్నారు. మే 10 తెల్లవారుజామున భారత్ బాలిస్టిక్ క్షిపణులతో నూర్ ఖాన్ ఎయిర్‌బేస్‌తో పాటు ఇతర ఎయిర్ బేస్‌లపై దాడులు చేసిందిన ఆయన బహిరంగంగా ప్రకటించారు.
Pakistan: భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు, ఆపరేషన్ సింధూర్‌పై పాకిస్తాన్ ప్రభుత్వం, పాకిస్తాన రాజకీయ నేతలు తప్పుడు కథనాలను చెబుతూనే వస్తున్నారు. ఈ యుద్ధంలో పాకిస్తాన్ విజయం సాధించిందంటూ పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చెప్పాడు. మరోవైపు, పాక్ వ్యాప్తంగా విక్టరీ ర్యాలీలు తీస్తున్నారు. ఈ ర్యాలీల్లో మాజీ క్రికెటర్ ఆఫ్రిదితో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. భారత్ ఓ వైపు క్లియర్‌గా శాటిలైట్ చిత్రాలతో పాకిస్తాన్‌కి జరిగిన నష్టాన్ని చూపిస్తుంటే, మరోవైపు తమకు ఏ కాలేదు,…
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్తాన్‌ని చావు దెబ్బ తీసింది భారత్. ఇటు ఉగ్రవాదుల స్థావరాలను నాశం చేస్తూనే, మరోవైపు పాక్ మిలిటరీకి గట్టి గుణపాఠం నేర్పింది. ఉగ్రవాదానికి పాకిస్తాన్ మద్దతను కూడా భారత్ బహిర్గతం చేసింది. ఇన్నాళ్లు తమ మిలిటరీ శక్తిని చూస్తూ గర్వపడిన పాకిస్తాన్‌కి భారత్ గర్వభంగం చేసింది. తమతో పెట్టుకుంటే పాకిస్తాన్ హర్ట్ ల్యాండ్‌లో కూడా దాడులు చేస్తామని నిరూపించింది.
BrahMos: పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’ పేరుతో పాకిస్తాన్‌లోని పలు ఉగ్రవాద స్థావరాలపై భీకర దాడులు చేసింది. ఈ దాడిలో జైషే మహ్మద్, లష్కరే తోయిబా ప్రధాన కార్యాలయాలతో పాటు వాటి ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసింది. 100కు పైగా ఉగ్రవాదుల్ని హతమార్చింది.