ఇండియాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెత్తనమేంటి..? అని మండిపడ్డారు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా.. ఆంధ్రప్రదేశ్ పర్యటనలో ఉన్న ఆయన.. తిరుపతిలో మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో భారతదేశం సురక్షితంగా లేదు.. అంటూ ఆందోళన వ్యక్తం చేశారు..
పహల్గామ్ ఉగ్రవాద దాడిని ఖండించాయి జీ7 దేశాలు, భారతదేశం, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించాలని పిలుపునిచ్చాయి. క్షిపణి దాడుల ఆరోపణల నేపథ్యంలో భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలను వెంటనే తగ్గించాలని జీ7 దేశాలు శనివారం కోరాయి.