దేశంలోని ప్రతి ఒక్కరికి భరత మాత గొంతుక అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. తాను చేపట్టిన భారత్ జోడో యాత్రలో తనను నిశ్శబ్ధశక్తి నడిపించిందని.. ఆ శక్తే భరతమాత అని అన్నారు.
MS Dhoni announced his retirement on August 15: ప్రతి ఏడాది ఆగస్టు 15న భారతదేశం అంతా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నా.. క్రికెట్ అభిమానులు మాత్రం ఈ రోజును ఎప్పటికీ మర్చిపోలేకపోతున్నారు. అందుకు కారణం భారత్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ‘ఎంఎస్ ధోనీ’. 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్, 2013 ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ, ప్రపంచ క్రికెట్‌లో టీమిండియాను నెంబర్ 1 స్థానం, విదేశీ గడ్డపై సిరీస్ విజయాలు..…
77 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుంచి ప్రధాని నరేంద్రమోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. మణిపూర్ లో శాంతి స్థాపన, దేశాభివృద్ధిలో యువత పాత్ర, తమ ప్రభుత్వ ఇప్పటి వరకు అమలు చేసిన పథకాలు తదితర విషయాల గురించి మోడీ వివరించారు. 10 సంవత్సరాలుగా మోడీ దేశ ప్రధానిగా స్వాతంత్ర్య దినోత్సవం రోజు ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. మరోవైపు స్వాతంత్ర దినోత్సవం రోజు సంప్రదాయ కార్మికులు, హస్తకళాకారులకు మోడీ గుడ్ న్యూస్ చెప్పారు. వారికోసం ‘విశ్వకర్మ…
(ఆగస్టు 15) స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కీలక సందేశం ఇచ్చారు. ప్రపంచంలోనే భారతదేశం అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం అని ఆమే కొనియాడారు.
పాకిస్తాన్ ఆగస్టు 14న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకులను జరుపుకుంటుంది. అందులో భాగంగా పాకిస్తాన్ జాతీయ జెండాకు అవమానం జరిగింది. ఈసారి దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫా ప్రదర్శనలో పాకిస్తాన్ జెండాను ప్రదర్శించలేదు. దీంతో పాకిస్థానీలు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. తమ దేశానికి మద్దతు తెలుపుతూ పాకిస్థాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు.
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రేపు గోల్కొండ పరిసరాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు పెట్టారు. ఇప్పటికే స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రూట్ మ్యాప్ ను పోలీసులు ఇచ్చారు.
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల వేళ.. బాంబు బెదిరింపు కాల్స్ కలకలం రేపుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో పలుచోట్ల బాంబులు పెట్టినట్లు సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే చర్యలు తీసుకుంటూ అలర్ట్ అయ్యారు. నగరంలోని శ్రమ శక్తి భవన్, కాశ్మీర్ గేట్, ఎర్రకోట, సరితా విహార్ లో గుర్తు తెలియని బ్యాగులను ఉంచినట్లు పోలీసులు గుర్తించారు.