స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రేపు గోల్కొండ పరిసరాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు పెట్టారు. ఇప్పటికే స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రూట్ మ్యాప్ ను పోలీసులు రిలీజ్ చేశారు. రేపు (మంగళవారం) స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని గోల్కొండకోట ప్రాంతంలో ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు అంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు పేర్కొన్నారు. అయితే, ఈ వేడుకలకు వచ్చే వారి కోసం పోలీసులు ప్రత్యేక రూట్ మ్యాప్ ఇచ్చారు.
Read Also: CM YS Jagan: ప్రపంచ స్థాయి విద్యాబోధన టార్గెట్.. సీఎం కీలక ఆదేశాలు
గోల్కొండ కోటలో ఇండిపెండెంట్ సెలబ్రేషన్ కోసం రాణిమహల్ లాన్స్ నుంచి గోల్కొండ కోట వరకు ఉన్న రోడ్డును పోలీసులు క్లోజ్ చేయనున్నారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు హాజరయ్యే ప్రముఖులు, అధికారులకు ఏ గోల్డ్, ఏ పింక్, బీ నీలం పాసులను ఇప్పటికే ఇచ్చేశారు. ఆ పాసులు ఉన్న.. వెహికిల్స్ కు మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు. సికింద్రాబాద్, బంజారాహిల్స్, మాసబ్ ట్యాంక్, మెహిదీపట్నం వైపు నుంచి గోల్డ్, ఏ పింక్, ఏ నీలం పాసులు ఉన్న వారిని గోల్కొండ కోటలోకి పర్మిషన్ ఇస్తారు.
Read Also: Viral video: వాట్ ఏ టాలెంట్ సారూ.. పోలీసోని బౌలింగ్ కు మైండ్ బ్లాకే..
ఏ గోల్డ్ పాసులున్న వారు తమ వెహికిల్స్ ను పోర్టు మెయిన్ గేట్ ఎదురుగా ఉన్న ప్రధాన రహదారిపై ఫతేదర్వాజా రోడ్డు దగ్గర పార్కింగ్ చేసుకోవాలని తెలిపారు. ఏ పింక్ పాసులున్న వాహనదారులు గోల్కొండ బస్టాప్ దగ్గర పార్క్ చేయనున్నారు. బీ నీలం పాసులున్న వెహికిల్స్ ఫుట్‌బాల్ గ్రౌండ్ దగ్గర పార్కింగ్ చేయాల్సి ఉందని పోలీసులు తెలిపారు. సీ గ్రీన్ పాసులున్న వాహనదారులు ఓసీ/ జీహెచ్ఎంసీ ప్లే గ్రౌండ్ వద్ద పార్కింగ్ చేయాలని పోలీసులు సూచించారు. డీ రెడ్ పాసులున్న వారు ప్రియదర్శిని స్కూల్లో పార్కింగ్ చేయాల్సి ఉంటుంది. ఇక, షేక్‌పేట్, టోలీచౌకీ నుంచి వచ్చే సాధారణ ప్రజలు వాహనాలను సెవెన్ టూంబ్స్ లోపల పార్కింగ్ కు పర్మిషన్ ఇచ్చారు.