పాకిస్తానీలు మన దేశాన్ని పొగిడితే ఆ కిక్కే వేరుగా ఉంటుంది కదా. పబ్జీ ఆటలో పరిచయమైన సచిన్ అనే యువకుడిని ప్రేమించి తన పిల్లలతో సహా దేశాన్ని విడిచి వచ్చేసిన మహిళ సీమా హైదర్ గుర్తింది కదా. తాజా హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో సీమా పాల్గొన్నారు. నోయిడాలోని తన ప్రియుడి ఇంట్లో పిల్లలతో కలిసి ఈ వేడుకలు చేసుకున్నారు. ఈ సందర్భంగా సీమా భారత జాతీయ పతాకం రంగు చీర ధరించింది. అంతేకాకుండా జాతీయ పతాకం…
Drones: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఢిల్లీలో పోలీసులు భద్రతను పెంచారు. ఢిల్లీ పోలీసులు జూలై 22 నుంచి ఆగస్టు 16 వరకు దేశ రాజధాని ఆకాశంలో పారాగ్లైడర్లు, హ్యాంగ్-గ్లైడర్లు, హాట్ ఎయిర్ బెలూన్‌లను ఎగరకుండా నిషేధించారు.
National Anthem: పంద్రాగస్టు వేడుకల్లో భాగంగా దేశంలోని అన్ని ప్రాంతాల్లో ప్రముఖులందరూ జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. అయితే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మొరాదాబాద్ గుల్ షహీద్ పార్క్ వద్ద కూడా పతాకావిష్కరణ చేయగా సమాజ్ వాదీ పార్టీ ఎంపీ ఎస్టీ హసన్ ఈ వేడుకకు హాజరయ్యారు. జాతీయ పతాకావిష్కరణ అనంతరం ఎంపీ హసన్ బిగ్గరగా జనగణమన పాడుతూ అందరిలోనూ దేశభక్తి రేకెత్తించేందుకు ప్రయత్నించారు. రెండు లైన్లు పాడాడో లేదో తర్వాత లైన్స్ రాలేదు. దీంతో…
బిహార్ యువతకు 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్న డిప్యూటి సీఎం తేజస్వీ యాదవ్ ప్రతిష్టాత్మక వాగ్దానానికి మద్దతు ఇస్తూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఈరోజు ఒక అడుగు ముందుకు వేశారు. మొత్తం ఉద్యోగావకాశాలు చివరికి రెట్టింపు అవుతాయని సూచించారు.
మన స్వాతంత్య్ర పోరాటం మహోన్నతమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. స్వాతంత్ర పోరాటానికి నిలువెత్తు రూపం జాతీయ జెండా అని ఆయన పేర్కొన్నారు . పింగళి వెంకయ్య రూపొందించిన జాతీయ జెండా.. భారతీయుల గుండె అని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏపీ ప్రభుత్వం నిర్వహించిన వేడుకలకు హాజరయ్యారు.
భారత ప్రజానీకం నవచేతనతో ముందడుగు వేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. దేశం ఎవరికీ తలవంచదని, ఎన్ని సవాళ్లు ఎదురైనా ముందుకెళ్తూనే ఉందన్నారు. స్వాతంత్య్ర సమరయోధులను ఇవాళ భారత్ గౌరవించుకుంటోందన్నని ఉద్వేగ పూరితంగా ప్రసంగించారు.
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎర్రకోటపై త్రివర్ణపతాకాన్ని ఎగురవేశారు. వరుసగా తొమ్మిదోసారి ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు మోదీ. అంతకుముందు సైనికుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు ప్రధాని. దేశ ప్రజలందరికీ ప్రధాని స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.