CM KCR Addressed at Independence Day Celebrations
హైదరాబాద్‌లోని గోల్కొండ కోట స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. త్రివర్ణ పతాకాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని రాష్ట్ర ప్రభుత్వం పిలుపునిచ్చిందన్నారు. స్వాతంత్య్ర వజ్రోత్సవ దినోత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నామని, తెలంగాణ ఆర్థిక రంగంలో దూసుకు పోవడంతో పాటు అన్నపూర్ణగా మారిందన్నా సీఎం కేసీఆర్. రాష్ట్రం అపూర్వ విజయాలను సాధిస్తోందని, హరితహారం కార్యక్రమంతో ఆకుపచ్చగా మారిందన్నారు సీఎం కేసీఆర్. తెలంగాణ తలసరి ఆదాయంలో నెంబర్‌వన్‌గా ఉందన్న సీఎం కేసీఆర్.. ప్రజాసంక్షేమం ప్రభుత్వాల బాధ్యత అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఉచితాలు అనే పదాన్ని తగిలించడం దారుణమని, గత ఏడేళ్లలో సొంత పన్నుల ఆదాయంలో తెలంగాణ నంబర్ వన్ అని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు.
కేంద్ర అసమర్థ నిర్వాకం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ కుంటుపడిందని సీఎం కేసీఆర్ విమర్శించారు. దేశంలో నిరుద్యోగం తీవ్రతరమవుతుందని, కేంద్రంలోని వారు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారే నేడు ఫాసిస్టు దాడులకు పాల్పడుతున్నారన్న సీఎం కేసీఆర్.. దేశ తలసరి ఆదాయం కంటే రాష్ట్ర తలసరి ఆదాయం 84 శాతం ఎక్కువ అని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం దళితబంధు అనే పథకాన్ని గొప్పగా అమలు చేస్తోందని సీఎం కేసీఆర్ తెలిపారు. దళితబంధు దేశానికి దిశానిర్ధేశం చేస్తోందని, ప్రభుత్వం వజ్రసంకల్పంతో దళిత బంధును అమలు చేస్తోందన్నారు. అహింసా మార్గంలో తెలంగాణ సాధించుకున్నామని, తెలంగాణ దేశానికి దిక్సూచిగా మారిందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.