జింబాబ్వేతో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో అనూహ్య ఓటమి చవిచూసిన ఒక్కరోజు తర్వాత అదే గడ్డపై యువ టీమిండియా భీకర ప్రదర్శనను కనిబరిచింది. జింబాబ్వేతో జరిగిన రెండో టీ-20లో 100 పరుగుల భారీ తేడాతో భారత్ ఘన విజయం సాధించింది.
హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన రెండో టీ-20లో భారత బ్యాటర్లు రెచ్చిపోయారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 234 పరుగులు చేసింది. జింబాబ్వే ఎదుట 235 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది.
భారత్, జింబాబ్వే జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ హరారే వేదికగా జరుగుతోంది. టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్‌ను ఎంచుకుంది. తొలి టీ-20 మ్యాచ్‌లో జింబాబ్వే చేతిలో షాక్ తిన్న భారత జట్టు.. ఈ మ్యాచ్‌లో గెలవాలని పట్టుదలతో ఉంది. జింబాబ్వే బౌలర్లను తేలిగ్గా తీసుకున్నారో, పిచ్‌ను సరిగ్గా అంచనా వేయలేకపోయారో కానీ తొలి మ్యాచ్‌లో భారత బ్యాటర్లు తేలిపోయారు.