శ్రీలంక క్రికెట్ టీం ఒక చెత్త రికార్డు నమోదు చేసింది. నిన్న ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో వన్డేలో ఓడిపోవడంతో….. వన్డే ఫార్మాట్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఓటమి పాలైన జట్టుగా నిలిచింది. మెత్తం వన్డే ఫార్మాట్‌లో 428 మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది లంక టీం. ఇప్పటివరకూ అత్యధిక వన్డేల్లో ఓటమి చవిచూసిన జట్టుగా టీమ్ ఇండియా ఉండేది. తాజాగా అత్యధిక ఓటమి పాలైన జట్లుగా టీం ఇండియా రెండో స్థానానికి చేరుకోగా, పాకిస్థాన్ మూడో ప్లేసులో ఉంది. షెడ్యూల్ ప్రకారం లంక జట్టు జులై 13 నుంచి కొలంబో వేదికగా భారత్‌తో మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడాల్సి ఉంది. ఈ మేరకు ధవన్ నేతృత్వంలోని భారత జట్టు ఇప్పటికే కొలంబోకి చేరుకుని క్వారంటైన్‌ను కూడా కంప్లీట్ చేసిన విషయం తెలిసిందే.