Pakistan girl supports Virat Kohli in Asia Cup 2023 IND vs PAK Match: భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి భారత్‌లోనే కాకుండా.. పాకిస్తాన్‌లోనూ చాలామందే అభిమానులు ఉన్న విషయం తెలిసిందే. విరాట్ ఆటను చూసేందుకు వారు తరచూ మైదానానికి వస్తుంటారు. ఆసియా కప్ 2023లో భాగంగా భారత్, పాకిస్తాన్ మధ్య శనివారం జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ బ్యాటింగ్ చూసేందుకు ఓ పాకిస్థాన్ యువతి వచ్చింది. మైదానంలో కోహ్లీని చూసి తెగ సంబరపడిపోయింది.…
Hockey 5s Asia Cup 2023: వరుణుడి దెబ్బకి ఆసియా కప్ లో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ రద్దయిన సంగతి తెలిసిందే. నాలుగేళ్ల తర్వాత దాయాదిలు బరిలో నిలవడంతో పోరు రసవత్తరంగా ఉంటుంది అభిమానులు తెగ సంబరపడ్డారు.
చిరకాల ప్రత్యర్థులు భారత్ -పాకిస్థాన్ జట్ల మధ్య ఆసియా కప్ పోరుకు శ్రీలంకలోని పల్లెకెలె వేదికైంది. దాయాది జట్లు ఈ మ్యాచ్‌లో గెలుపు కోసం పోరులో తలపడనున్నారు.
ఆసియా కప్-2023లో భాగంగా నేడు ( శనివారం ) పల్లెకెలె వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న హైఓల్టేజీ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ తీసుకున్న టీమిండియా.. పాక్ బౌలర్ల ధాటికి చతికిలపడింది. షాహీన్ అఫ్రిది, హరీస్ రౌఫ్ నిప్పులు చెరిగే బంతులతో రెచ్చిపోవడంతో భారత జట్టు టాపార్డర్ 66 పరుగులకే కుప్పకూలింది.
సెలక్షన్‌కు వారం ముందు నిర్వహించిన ఫిట్నెస్ పరీక్షలో సక్సెస్ కావడం.. నాకెంతో సంతోషాన్నిచ్చింది అని శ్రేయస్ అయ్యర్ అన్నారు. నిజానికి నిన్న రాత్రంతా నాకు నిద్రపట్టలేదు.. పాకిస్తాన్‌తో మ్యాచ్ ఆడటానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూశాను అని అతడు వెల్లడించాడు.
టీమిండియా సారథి రోహిత్ శర్మను అద్భుత బంతితో అవుట్ చేసిన తీరు ఎవరూ మర్చిపోలేరు.. కాబట్టి ఈసారి షాహిన్ ఆఫ్రిది బౌలింగ్ ను ఎదుర్కొనేటపుడు రోహిత్ శర్మ అత్యంత జాగ్రత్తగా ఉండాలి అని హెడెన్ తెలిపాడు.
Babar Azam on Virat Kohli: ఆసియా కప్ 2023 ఆరంభం అయింది. తొలి మ్యాచ్‌లో నేపాల్‌ను పాకిస్థాన్ చిత్తు చిత్తుగా ఓడించింది. పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ సెంచరీ చేయడంతో పాక్ సునాయాస విజయం సాధించింది. ఇక శనివారం భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య కీలక సమరంకు బాబర్ సేన సిద్ధం అవుతుంది. అయితే గతంలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తనను ప్రశంసిస్తూ చేసిన కామెంట్లపై బాబర్ స్పందించాడు. ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాటర్…
Jasprit Bumrah Plays FIFA With Wife Sanjana Ganesan Ahead of IND vs PAK Match: క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మెగా మ్యాచ్‌కు సమయం అసన్నమైంది. ఆసియా కప్ 2023లో భాగంగా మరో రెండు రోజుల్లో దాయాదులు భారత్, పాకిస్తాన్ తలపడనున్నాయి. సెప్టెంబర్ 2న శ్రీలంకలోని కాండీ వేదికగా ఈ హై ఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ఇండో-పాక్ ఆటగాళ్లు ముమ్మర సాధన చేస్తున్నారు. ఆధిపత్యం చెలాయించేందుకు…
Asia Cup Winners List from 1984 to 2023: ఆసియా దేశాల మధ్య క్రికెట్ సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి, ఉన్నతస్థాయికి చేరుకోవడానికి ‘ఆసియా క్రికెట్ కౌన్సిల్’ ఆలోచనల నుంచి పుట్టుకొచ్చిందే ‘ఆసియా కప్’. ముందుగా కేవలం మూడు జట్లతోనే ప్రారంభమైన ఈ టోర్నీ.. ఇప్పుడు ఆరు టీమ్‌లతో నిర్వహించే స్థాయికి ఎదిగింది. ప్రతి రెండేళ్లకు ఓసారి ఆసియా కప్‌ను నిర్వహించాలని భావించినా.. కొన్నిసార్లు అనివార్య కారణాల వల్ల వాయిదా పడిన సందర్భాలూ ఉన్నాయి. ఆసియా కప్ ప్రస్తుతం…
Shaheen Afridi injury scare ahead of IND vs PAK Clash: ఆసియా కప్ 2023లో పాకిస్తాన్ శుభారంభం చేసింది. బుధవారం ముల్తాన్ వేదికగా పసికూన నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో పాక్ ఘన విజయం సాధించింది. 238 పరుగుల తేడాతో నేపాల్‌ను చిత్తు చిత్తుగా ఓడించింది. ఆసియా కప్ టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో బోణి కొట్టిన పాకిస్తాన్‌కు భారత్‌తో మ్యాచ్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది. పాక్ స్టార్ పేసర్ షాహీన్ షా అఫ్రిది…