IND vs PAK: దుబాయ్‌లోని ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్- పాకిస్తాన్ మధ్య బ్లాక్ బస్టర్ మ్యాచ్ జరగబోతుంది. ఈ రెండు జట్ల మధ్య పోరు ఉత్కంఠభరితంగా కొనసాగనుంది.
కింగ్ కోహ్లీ తుది జట్టులో కీ ప్లేయర్.. అతను ఫాంలో ఉన్న లేకపోయినా జట్టులో ఉంటే అదొక బలం అని చెప్పాలి. ప్రత్యర్థి ఎవరైనా కాస్త జాగ్రత్తగా ఉంటారు. ఈ రోజు పాకిస్తాన్ తో జరిగే మ్యాచ్ లో విరాట్ ఆడేది అనుమానంగా ఉంది. ఎందుకంటే ప్రాక్టీస్ చేసే సమయంలో కోహ్లీ కాలికి దెబ్బ తగిలినట్టు కనిపించింది.
టీమిండియా ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగడంపై పాకిస్తాన్ బౌలింగ్ కోచ్ అకిబ్ జావేద్ స్పందించారు. ఈ సందర్భంగా భారత్ స్పిన్ దాడి గురించి తమ జట్టు ఎలాంటి ఆందోళన చెందడం లేదని అన్నారు. తమ జట్టులో స్పిన్నర్లు లేకపోవడం వల్ల ఎటువంటి ప్రతికూలత లేదన్నారు.
ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీకి తెరలేచింది. నేడు ఫిబ్రవరి 19న పాకిస్తాన్, న్యూజీలాండ్ మధ్య తొలి మ్యాచ్ జరిగింది. కరాచీలోని నేషనల్ స్టేడియం వేదికగా ఇరు జట్లు గెలుపు కోసం పోటీపడ్డాయి. తొలి మ్యాచ్ లో న్యూజీలాండ్ అద్భుతమైన విజయాన్ని అందుకుంది. డిఫెండింగ్ ఛాంపియన్ పాకిస్తాన్ ను చిత్తుగా ఓడించిన న్యూజీలాండ్ ఛాంపియన్ ట్రోఫీలో ఖాతా తెరిచింది. 60 పరుగుల తేడాతో పాక్ పై కివీస్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో భాగంగా ముందుగా టాస్…
కరాచీ స్టేడియంలో చోటు చేసుకున్న ఓ ఘటన వివాదానికి దారి తీసింది. దీంతో భారత జాతీయ జెండాను ఆ స్టేడియంలో ప్రదర్శించకపోవడంతో పాక్ తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దెబ్బకి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు దిగొచ్చింది. ఇక, దిద్దుబాటు చర్యల్లో భాగంగా ఆ స్టేడియంలో ఇండియన్ ఫ్లాగ్ ను ప్రదర్శించింది. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట దర్శనమిస్తున్నాయి.
Champions Trophy 2025: ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఈరోజు (ఫిబ్రవరి 19) నుంచి ప్రారంభం కానుంది. కరాచీ స్టేడియంలో జరిగే మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ పాకిస్తాన్- న్యూజిలాండ్‌తో తలపడటంతో టోర్నమెంట్ ప్రారంభమవుతుంది.
ICC Champions Trophy 2025: ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఛాంపియన్స్ ట్రోఫీ 2025 రేపటి నుంచి ప్రారంభం కానుంది. కరాచీలో జరిగే మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ పాకిస్తాన్- న్యూజిలాండ్‌తో తలపడటంతో టోర్నమెంట్ ప్రారంభమవుతుంది.
దాయాదుల మధ్య జరిగే బ్లాక్ బస్టర్ పోరులో గొప్ప ప్రదర్శన చేసే ప్లేయర్స్ ఎవరో టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్, పాక్ మాజీ కెప్టెన్లు ఇంజమామ్, షాహిద్ అఫ్రిదీ తెలియజేశారు. ఈ మ్యాచ్‌లో భారత్ తరఫున శుభ్‌మన్ గిల్ అత్యధిక రన్స్ చేస్తాడని.. అటు బౌలింగ్ లో మహమ్మద్ షమీఎక్కువ వికెట్లు తీస్తాడని యువీ పేర్కొనగా.. పాకిస్థాన్ వైపు బ్యాట్‌తో బాబర్ అజామ్ .. బాల్ తో షాహిన్ అఫ్రిదీ ఆకట్టుకుంటారని అఫ్రిదీ చెప్పుకొచ్చాడు.
ఫిబ్రవరి 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఆరంభం కానుంది. ఈ టోర్నీ కోసం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) సర్వం సిద్ధం చేస్తోంది. ట్రోఫీ ఏర్పాట్లలో బిజీగా ఉన్న పీసీబీకి మరో తలనొప్పి వచ్చింది. పాకిస్థాన్‌కు వన్డే ప్రపంచకప్ అందించిన మాజీ కెప్టెన్, మాజీ పీఎం ఇమ్రాన్ ఖాన్ పేరును గడాఫీ స్టేడియం నుంచి తొలగిస్తారనే ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతోంది. ఈ వార్తలపై పీసీబీ వర్గాలు స్పందించాయి. ఎవరి పేర్లను తొలగించడం గాని, మార్చడం…
ప్రతిష్ఠాత్మక ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫిబ్రవరి 19న ప్రారంభం కానుంది. ఈ ట్రోఫీ ఆరంభోత్సవాన్ని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ), అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కలిసి ఫిబ్రవరి 16న లాహోర్‌లో నిర్వహించనున్నాయి. ఈ కార్యక్రమంకు చారిత్రక లాహోర్ కోటలోని హుజూరి బాగ్ వేదిక కానుంది. అయితే ఐసీసీ టోర్నీ ఆరంభానికి ముందు సంప్రదాయంగా వస్తున్న అన్ని జట్ల కెప్టెన్ల ఫొటోషూట్, మీడియా సమావేశాన్ని ఈసారి నిర్వహించడం లేదని తెలుస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ప్రధాన జట్లు…