ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా నేడు భారత్- న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ జరుగింది. ఈ మ్యాచ్ లో భారత్ కివీస్ పై ఘన విజయం సాధించింది. 44 పరుగుల తేడాతో న్యూజీలాండ్ ను చిత్తు చేసింది. 250 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ కు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. బౌలర్ల్ ధాటికి కివీస్ ప్లేయర్స్ పెవిలియన్ కు క్యూ కట్టారు. కివీస్ 45.3 ఓవర్లలో 205 పరుగులు మాత్రమేచేసి ఆలౌట్ అయ్యింది. కాగా టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. భారత్ తరఫున శ్రేయాస్ అయ్యర్ అత్యధికంగా 79 పరుగులు చేశాడు. అక్షర్ పటేల్ (42), హార్దిక్ పాండ్య (45) పరుగులతో రాణించారు.
Also Read:Goutham Tinnanuri: గౌతమ్ తిన్ననూరితో కేక్ కట్ చేయించిన విజయ్ దేవరకొండ
ఈ మ్యాచ్‌లో హీరోలుగా నిలిచినవారు మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ శ్రేయాస్ అయ్యర్, స్టార్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి. అయ్యర్ అర్ధశతకం సాధించాడు. దీని తర్వాత, వరుణ్ 5 వికెట్లు తీసి న్యూజిలాండ్‌ను ఓడించాడు. దీంతో భారత జట్టు గ్రూప్-ఎలో అగ్రస్థానంలో నిలిచింది. ఈ రెండు జట్లు ఇప్పటికే సెమీఫైనల్‌కు చేరుకున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు సెమీఫైనల్లో ఆస్ట్రేలియాతో తలపడుతుంది. ఈ మ్యాచ్ మార్చి 4న జరుగుతుంది. ఓడిన జట్టు సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాతో తలపడుతుంది. మార్చి 5న జరిగే రెండవ సెమీఫైనల్లో న్యూజిలాండ్ దక్షిణాఫ్రికాతో తలపడనుంది. ఈ మ్యాచ్ లాహోర్‌లో జరుగుతుంది.