వన్డే సిరీస్‌లో భాగంగా భారత్, న్యూజిలాండ్ మధ్య నేడు తొలి వన్డే జరగనుంది. వడోదరలో మధ్యాహ్నం 1.30కు మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించే అవకాశం ఉంది. మరో 25 పరుగులు చేస్తే.. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రపంచ రికార్డు బ్రేక్ అవుతుంది. ఈరోజు (జనవరి 11) కింగ్ కోహ్లీకి చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే విరాట్ కుమార్తె వామిక పుట్టినరోజు నేడు. అంతర్జాతీయ…
భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ నేటి నుంచి ఆరంభం కానుంది. ఆదివారం మధ్యాహ్నం 1.30 నుంచి వడోదరలో తొలి మ్యాచ్ ఆరంభం కానుంది. 2024లో సొంతగడ్డపై టీమిండియాను వైట్‌వాష్ చేసిన కివీస్.. ఇప్పుడు మరలా భారత పర్యటనకు వచ్చింది. మరోసారి టీమిండియాపై సత్తాచాటాలని కివీస్ టీమ్ భావిస్తోంది. గత పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని భారత్ చూస్తోంది. రెండు టీమ్స్ బలంగా ఉండడంతో రసవత్తర పోరు ఖాయం. న్యూజిలాండ్‌తో మొదటి వన్డే నేపథ్యంలో భారత్…
IND vs NZ: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ కోసం భారత జట్టు సమాయత్తం అవుతోంది. 3 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య ఆదివారం ( జనవరి 11న) తొలి వన్డే జరగనుంది. ఈ నేపథ్యంలో టీమిండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ప్రాక్టీస్‌లో నిమగ్నం అయ్యారు.
Tilak Varma Out From IND vs NZ T20 Series Due to Injury: భారత క్రికెట్ జట్టుకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. తెలుగు ఆటగాడు, మిడిల్ ఆర్డర్ బ్యాటర్ తిలక్ వర్మ న్యూజిలాండ్‌తో జరగనున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు దూరమయ్యాడు. అయితే ఈ విషయాన్ని బీసీసీఐ ఇంకా ద్రువీకరించాల్సి ఉంది. తాజా సమాచారం ప్రకారం.. గాయం కారణంగా తిలక్ వర్మ పొట్టి సిరీస్‌లో పాల్గొనలేకపోతున్నాడు. భారత్, న్యూజిలాండ్ టీ20 సిరీస్ జనవరి 21…
టీమిండియా అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లలో ‘మహ్మద్ షమీ’ ఒకడు. అతడి నైపుణ్యం, రికార్డులు అద్భుతం. అయితే ఇటీవలి కాలంలో వరుస గాయాలతో భారత జట్టుకు దూరమయ్యాడు. ప్రస్తుతం ఫిట్‌గా ఉన్న 35 ఏళ్ల షమీ.. దేశవాళీల్లోనూ సత్తా చాటుతున్నాడు. ప్రతి మ్యాచ్‌లో వికెట్స్ తీస్తూ.. తాను ఉన్నా అంటూ బీసీసీఐ సెలక్టర్లకు హెచ్చరికలు పంపుతున్నాడు. కానీ సెలక్టర్లు మాత్రం అతడిని పట్టించుకోవడం లేదు. సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో జరిగే వన్డే సిరీస్‌కు ఎంపిక చేయలేదు. ఇక షమీని భారత…
త్వరలో న్యూజిలాండ్‌తో జరిగే వన్డే సిరీస్‌కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారత జట్టును ప్రకటించింది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ 15 మందితో కూడిన జట్టును ఈరోజు అధికారికంగా ప్రకటించింది. వన్డే సిరీస్‌కు శుభ్‌మన్ గిల్ కెప్టెన్ కాగా.. మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించింది. వికెట్ కీపర్ రిషభ్ పంత్‌కు బీసీసీఐ అవకాశం ఇచ్చింది. న్యూజిలాండ్‌తో జరిగే వన్డే సిరీస్‌కు శ్రేయస్ అయ్యర్ ఎంపికైనా.. బీసీసీఐ సెంటర్…
న్యూజిలాండ్‌తో జరగబోయే వన్డే సిరీస్‌కు టీమిండియా ఎంపికపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. సీనియర్, యువకులతో టీమ్ సమతుల్యంగా ఉండేలా బీసీసీఐ సెలెక్టర్లు జట్టును సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. మూడు వన్డేల సిరీస్‌కు అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ శుక్రవారమే జట్టును ఎంపిక చేయాల్సి ఉండగా.. అనివార్య కారణాలతో ఈరోజటికి వాయిదా పడింది. కెప్టెన్సీ బాధ్యతలు యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌కు అప్పగించే అవకాశం ఉండటం ఈ సిరీస్ ప్రత్యేక ఆకర్షణగా మారింది. బ్యాటింగ్ విభాగంలో రోహిత్…
న్యూజిలాండ్ జట్టు వచ్చే ఏడాది ప్రారంభంలో భారతదేశంలో పర్యటించనుంది. రెండు జట్ల మధ్య 3 వన్డేలు, 5 టీ20 మ్యాచ్‌ల సిరీస్ జరగనుంది. ఈ సిరీస్ షెడ్యూల్ విడుదలైంది. వన్డే సిరీస్ జనవరి 11 నుంచి ప్రారంభమవుతుంది. చివరి మ్యాచ్ జనవరి 18 న జరుగుతుంది. టీ20 సిరీస్ జనవరి 21 నుంచి ప్రారంభమవుతుంది. చివరి టీ20 మ్యాచ్ జనవరి 31 న జరుగుతుంది.పిటిఐ నివేదిక ప్రకారం, వన్డే సిరీస్‌లోని మొదటి మ్యాచ్ జనవరి 11న హైదరాబాద్‌లో,…
ఐసీసీ 2025 ఛాంపియన్స్ ట్రోఫీని భారత్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఫైనల్లో న్యూజిలాండ్‌ని ఓడించి.. మూడోసారి ట్రోఫీని అందుకుని రికార్డు సృష్టించింది. అయితే ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఒక పరుగుకే ఔట్ అయ్యాడు. మైఖేల్ బ్రేస్‌వెల్ బౌలింగ్‌లో ఎల్బీగా పెవిలియన్ చేరాడు. దాంతో విరాట్ ఫాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. కింగ్ ఔట్ అవ్వగానే ఓ 14 ఏళ్ల బాలిక గుండెపోటుకు గురై చనిపోయిందని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.…
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజేతగా భారత్ నిలిచింది. ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై గెలిచి మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీ కైసవం చేసుకుంది. ఫైనల్లో అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న రోహిత్ శర్మకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. టోర్నీ ఆసాంతం రాణించిన న్యూజిలాండ్ ఆటగాడు రచిన్ రవీంద్రను ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు వరించింది. ఈ అవార్డుపై టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్పందించాడు. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అసలైన హీరో…