Team India: బుధవారం నాడు ఉప్పల్ వేదికగా హైదరాబాద్ నగరంలో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి వన్డే జరగనుంది. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా సోమవారం సాయంత్రం హైదరాబాద్ చేరుకుంది. తిరువనంతపురం నుంచి నేరుగా శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరింది. ఈరోజు ఉదయమే విరాట్ కోహ్లీ హైదరాబాద్ చేరుకోగా.. మిగిలిన సభ్యులు సాయంత్రం వచ్చారు. టీమిండియా రాక సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అటు టీమిండియా క్రికెటర్ల కోసం అధికారులు ప్రత్యేక…
న్యూజిలాండ్, భారత జట్ల మధ్య జరుగుతున్న మూడో వన్డే వర్షం కారణంగా రద్దైంది. మూడు వన్డేల సిరీస్ న్యూజిలాండ్ 1-0 తేడాతో కైవసం చేసుకుంది. తొలి వన్డేను న్యూజిలాండ్ గెలుచుకోగా.. మిగిలిన రెండు మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దు కావడం గమనార్హం.
IND Vs NZ: క్రైస్ట్ చర్చ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో భారత్ తడబడింది. సిరీస్ సమం కావాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ధావన్ సేన 47.3 ఓవర్లలో 219 పరుగులకే కుప్పకూలింది. ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ సుందర్ రాణించకపోతే టీమిండియా పరిస్థితి దారుణంగా ఉండేది. అతడు 51 పరుగులతో రాణించాడు. సుందర్ ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. అంతకుముందు ఓపెనర్లు ధావన్ (28), గిల్ (13) విఫలమయ్యారు.…
Team India: టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ పేలవ ఫామ్ కొనసాగిస్తున్నాడు. క్రైస్ట్ చర్చ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో వన్డేలోనూ పంత్ విఫలమయ్యాడు. కేవలం 10 పరుగులకే అవుటయ్యాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు క్రీజులోకి వచ్చిన పంత్ ఆచితూచి ఆడతాడని అభిమానులు భావించారు. కానీ 16 బంతుల్లో రెండు ఫోర్లు సహాయంతో 10 పరుగులు చేసి మిచెల్ బౌలింగ్‌లో ఫిలిప్స్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో సంజు శాంసన్ అభిమానులు పంత్‌ను సోషల్…
IND Vs NZ: న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న టీమిండియా ఆఖరి పోరుకు సిద్దమైంది. క్రైస్ట్ చర్చ్ వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో టాస్ గెలిచిన న్యూజిలాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. రెండో వన్డేలో ఆడిన జట్టునే మూడో వన్డేలో టీమిండియా కొనసాగించింది. అటు న్యూజిలాండ్ మాత్రం ఓ మార్పు చేసింది. రెండో వన్డేలో ఆడిన బ్రాస్వెల్ను పక్కనపెట్టి ఆడమ్ మిల్నేను జట్టులోకి తీసుకుంది. వన్డే సిరీస్ కాపాడుకోవాలంటే ఈ మ్యాచ్‌లో టీమిండియా తప్పనిసరి గెలవాలి. మూడు మ్యాచ్‌ల ఈ…
హామిల్టన్‌లోని సెడాన్ పార్క్‌లో భారత్, న్యూజిలాండ్ మధ్య జరగాల్సిన రెండో వన్డే వర్షం కారణంగా రద్దైంది. భారత్ 12.5 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 89 పరుగులు చేసిన సమయంలో వర్షం ఆటకు అంతరాయం కలగడంతో చివరికి ఆట రద్దయింది.
హామిల్టన్‌లోని సెడాన్ పార్క్‌లో జరుగుతున్న రెండో వన్డేకు వరుణుడు అంతరాయం కలిగించినప్పటికీ.. మ్యాచ్‌ను 29 ఓవర్లకు కుదించి ఆటను ప్రారంభించారు. వర్షం తగ్గిపోవడంతో భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య రెండో వన్డే మ్యాచ్‌ను 29 ఓవర్లకు కుదిస్తూ అంపైర్లు నిర్ణయం తీసుకున్నారు.
హామిల్టన్‌లోని సెడాన్ పార్క్‌లో జరుగుతున్న రెండో వన్డేకు వరుణుడు అడ్డు తగిలాడు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా మొదటి వన్డేలో కివీస్ విజయం సాధించగా.. ఈ మ్యాచ్ భారత్‌కు ఎంతో కీలకం. 4.5 ఓవర్ల వద్ద వర్షం ప్రారంభం కావడంతో మ్యాచ్‌కు అంతరాయం కలిగింది. ఆట ఆగిపోయే సమయానికి టీమిండియా వికెట్ నష్టపోకుండా 22 పరుగులు చేసింది.
హామిల్టన్‌లోని సెడాన్ పార్క్‌లో జరుగుతున్న రెండో వన్డేలో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. సంజూ శాంసన్, శార్దూల్ ఠాకూర్ల స్థానంలో దీపక్ హుడా, దీపక్ చాహర్‌లను తీసుకురావడంతో భారత్ రెండు మార్పులు చేసింది.
Shardul Thakur: టీమిండియా పేస్ బౌలర్ శార్దూల్ ఠాకూర్‌పై సోషల్ మీడియాలో ట్రోల్స్ నడుస్తున్నాయి. ఒక్క ఓవర్‌తో టీమిండియా నుంచి మ్యాచ్‌ను అతడు దూరం చేశాడని నెటిజన్లు మండిపడుతున్నారు. ముఖ్యంగా శార్దూల్ ఠాకూర్ వేసిన 40వ ఓవర్లో న్యూజిలాండ్ బ్యాటర్ టామ్ లాథమ్ ఐదు బౌండరీలతో 25 పరుగులు పిండుకున్నాడు. ఈ ఓవర్లో తొలి బంతిని టామ్ లాథమ్ డీప్ బ్యాక్వార్డ్ దిశగా సిక్సర్ బాదాడు. రెండో బంతిని వైడ్ వేయగా.. ఎక్స్ట్రా బాల్‌ను బౌండరీ తరలించాడు.…