భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా మరికొద్దిసేపట్లో చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో తొలి టెస్టు ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లా కెప్టెన్ నజ్ముల్ శాంటో బౌలింగ్ ఎంఛుకున్నాడు. పిచ్‌పై తేమ ఉందని, దానిని ఉపయోగించాలనుకుంటున్నామని చెప్పాడు. ముగ్గురు స్పిన్నర్లతో బంగ్లా బరిలోకి దిగుతోందని శాంటో తెలిపాడు.
తాము కూడా ముందుగా బౌలింగ్ చేయాలనుకున్నాం అని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు. ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగుతున్నామన్నాడు. జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ బౌలర్లు అని పేర్కొన్నాడు. ముందే ఊహించినట్లు రిషబ్ పంత్, కేఎల్ రాహుల్ జట్టులోకి వచ్చారు. ఇటీవలే పాకిస్థాన్‌ను ఓడించిన బంగ్లా మరో సంచలనం చేయాలని చూస్తోంది. మరోవైపు ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరుకొనేందుకు మార్గం సుగమం చేసుకోవాలని భారత్ సిద్దమైంది.
Also Read: Kamindu Mendis: ఒక సెంచరీ.. ఏకంగా ఐదు రికార్డులు సొంతం! డాన్ బ్రాడ్‌మన్‌తో సమంగా
తుది జట్లు:
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్.
బంగ్లాదేశ్: నజ్ముల్ శాంటో (కెప్టెన్), షాద్మన్ ఇస్లామ్, జాకిర్ హసన్, మొమినుల్, ముష్ఫికర్ రహీమ్, షకీబ్, లిటన్ దాస్, మెహిదీ మిరాజ్, నహిద్ రాణా, హసన్ మహ్మద్, తస్కిన్ అహ్మద్.