వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌ను నిలిపివేయాలని హెచ్చరిస్తూ ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ మరోమారు బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ సందర్భంగా ఓ వీడియోను రిలీజ్ చేశారు.
వన్డే ప్రపంచ కప్ 2023 చివరి అంకానికి చేరుకుంది. రేపు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఆస్ట్రేలియాతో టీమిండియా పోటీ పడుతుంది. 20 ఏళ్ల తర్వాత వన్డే ప్రపంచకప్‌లో భారత్, ఆస్ట్రేలియాలు ఫైనల్‌లో తలపడుతున్నాయి.
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియంలో జరగనున్న ప్రపంచ కప్ 2023 ఫైనల్ మ్యాచ్‌కు వర్షం ముప్పు లేదని వాతావరణ శాఖ తెలిపింది. అహ్మదాబాద్ నగరంలో విపరీతమైన ఎండలు ఉండబోతున్నాయని వెదర్ డిపార్ట్మెంట్ చెప్పింది.
తాజాగా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ పై బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ స్పందించారు. రేపు (ఆదివారం) జరిగే ఫైనల్స్ విజేత ఎవరో అతను తేల్చి చెప్పారు. ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలుస్తుందనే గట్టి నమ్మకం తనకు ఉందని పేర్కొన్నారు.
అహ్మదాబాద్ నగరాన్ని పోలీసుల గుప్పిట్లోకి తీసుకున్నారు. వరల్డ్ కప్ ఫైనల్ సందర్భంగా సిటీ వ్యాప్తంగా గట్టి బందోబస్తు చేశారు. ఫైనల్ మ్యాచ్ కి ముఖ్య అతిథులుగా భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, ఆస్ట్రేలియా ఉప ప్రధాని రిచర్డ్ మార్లెస్ తో పాటు పలువురు ప్రముఖులు, సినీ ప్రముఖులు వస్తుండటంతో గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ అత్యున్నత సమావేశం నిర్వహించారు.
ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లో అత్యధిక గోల్డెన్ బ్యాట్‌లను భారత జట్టు కలిగి ఉంది. సచిన్ టెండూల్కర్ రెండుసార్లు గోల్డెన్ బ్యాట్ గెలుచుకోగా.. రోహిత్ శర్మ గత ప్రపంచ కప్‌లో టీమిండియా తరపున అత్యధిక పరుగులు చేయడంతో గోల్డెన్ బ్యాట్ తన ఖాతాలో వేసుకున్నాడు.
రేపు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్ మ్యాచ్ జరగనుంది. రేపు మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యే ఫైనల్‌లో భారత్- ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. ఈ ఫైనల్ మ్యాచ్‌ను ప్రజలు ఒకే చోట వీక్షించేలా తెలుగు రాష్ట్రాల్లో బిగ్ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నారు.