తెలంగాణకు హైదరాబాద్ వాతావారణశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. మరో రెండ్రోజుల పాటు పలు జిల్లాల్లో వానలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. భారీ వర్షసూచన నేపథ్యంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
భారత వాతావరణ శాఖ మహారాష్ట్ర రైతులకు శుభవార్త అందించింది. మరో ఐదు రోజుల్లో రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. రాబోయే ఐదు రోజుల పాటు మహారాష్ట్రలో వర్ష సూచనను భారత వాతావరణ విభాగం (IMD) విడుదల చేసింది.
సుందరమైన హిమాచల్‌ప్రదేశ్ భారీ వర్షాలు, వరదలతో బీతావహంగా మారిపోతోంది. గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదలతో రాష్ట్రం వేల కోట్ల నష్టపోయింది.
ఒడిశాలోని పలు ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటంతో గత 24 గంటల్లో వర్షాలు దంచికొట్టాయి. భువనేశ్వర్, కటక్ జంట నగరాలతో సహా ఒడిశాలోని 18 జిల్లాల్లో శుక్రవారం ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అంతేకాకుండా ఆ ప్రాంతాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
Delhi Weather: దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం సూరీడు సుర్రుమంటున్నాడు. ఎండ వేడిమి, తేమకు జనాలు అల్లాడిపోతున్నారు. భారత వాతావరణ విభాగం (IMD) వర్షాలకు సంబంధించి తాజాగా ఓ అప్ డేట్ అందించింది.