Michoung Cyclone: తెలంగాణకు రెయిన్ అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను మిచౌంగ్ ఉత్తర తెలంగాణపై మరింత ప్రభావం చూపనుంది.
డిసెంబర్ 2న బంగాళాఖాతంలో ఏర్పడిన మిచౌంగ్ తుపాను.. డిసెంబర్ 5 అర్ధరాత్రి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు తీరాన్ని తాకనుంది. దీంతో.. ఒడిశా, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పుదుచ్చేరిలలో తుపాను ప్రభావం ఉంటుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. అంతేకాకుండా.. గాలులు గంటకు 90 నుండి 110 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని తెలిపింది. ఇప్పటికే.. చెన్నైలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షాల కారణంగా వరదల పరిస్థితి నెలకొనగా.. ఇప్పటి వరకు ముగ్గురు మృతి…
Michaung Cyclone: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం ఆదివారం 'మిచాంగ్' తుపానుగా మారింది. డిసెంబర్ 5 నాటికి నెల్లూరు-మచిలీపట్నం మధ్య దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తాకే అవకాశం ఉంది.
Rain Alert to Telangana: తెలంగాణలో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. మధ్య భారతదేశంతో పాటు ఉత్తర తెలంగాణ ప్రాంతాలపై ఆకాశం మేఘావృతమై ఉంటుందని పేర్కొంది. రేపు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం సర్వం సిద్ధమవుతున్న క్రమంలో రాష్ట్రానికి వాతావరణ కేంద్రం వర్ష సూచన ప్రకటించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నేడు వాయుగుండంగా బలపడనుందని కేంద్ర వాతావరణ కేంద్రం బుధవారం వెల్లడించింది. Also…
Weather Update: దేశ రాజధాని ఢిల్లీతోపాటు ఇతర ప్రధాన నగరాల్లో చలి పెరిగే అవకాశం ఉంది. దీనితో పాటు సాయంత్రం తర్వాత సూర్యోదయం వరకు పొగమంచు కొనసాగుతోంది. దీని కారణంగా దృశ్యమానత తగ్గుతుంది.
Telangana Rains: తెలంగాణ రాష్ట్రం వైపు తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి వడగళ్ల వాన కురుస్తుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని తెలికపాటి నుంచి కొన్ని చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉంది.
Telangana Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలో పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో గురువారం ఉదయం నుంచి ఓ మోస్తరు వర్షం కురుస్తోంది.
క్రింది స్థాయి ఈశాన్య, ఆగ్నేయ దిశ నుంచి తెలంగాణ వైపు వీస్తున్న గాలులు వీస్తు్న్నాయని.. రాబోయే నాలుగైదు రోజులు పాటు తెలంగాణలో మోస్తారు నుంచి తేలిక పాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సీనియర్ ఆఫీసర్ శ్రావణి పేర్కొన్నారు. ఈశాన్య జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు.
Heavy Rainfall:తమిళనాడు, కేరళలోని పలు జిల్లాల్లో గురువారం భారీ వర్షం కురిసింది. ఈ వర్షాల కారణంగా తమిళనాడులోని పలు జిల్లాల్లో కూడా కొండచరియలు విరిగిపడడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.
Rain Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తెలుగు రాష్ట్రాలపై ప్రభావం చూపుతోంది. రానున్న మూడు రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.