అల్పపీడన ప్రభావంతో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో సాధారణం నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. అయితే, నేడు కూడా హైదరాబాద్ నగరం సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీగా వానలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ప్రకటిచింది.
బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అల్పపీడన ప్రభావంతో నేడు రేపు రాష్ట్రానికి మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని సూచించింది.
గత కొన్ని వారాలుగా హిమాచల్ ప్రదేశ్ లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అక్కడి జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అయితే వారి కష్టాలు ఇప్పట్లో తగ్గేట్టు కనిపించడం లేదు. మండి సహా రాష్ట్రంలోని ఆరు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించింది.
దేశంలోని చాలా ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. పలు రాష్ట్రాలకు IMD హెచ్చరిక జారీ చేసింది. పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.
ఏపీలో వానలు లేక రైతులు వారి పంటలను పండించడానికి నీళ్ల కోసం తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు వాతావరణ శాఖ రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. రానున్న మూడు రోజులు కోస్తాంధ్రలో అనేక చోట్ల, రాయలసీమలో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి.
దేశంలోని పలు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని అనేక ప్రాంతాల్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. దీంతో వర్షాల కారణంగా 19 మంది చనిపోయారు. అటు ఉత్తరాఖండ్‌లో కూడా కొండచరియలు విరిగిపడ్డాయి. మరోవైపు పలు రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ.