అస్సాం రాష్ట్రం వరద విలయంలో చిక్కుకుంది. గత కొన్ని రోజలు నుంచి భారీ వర్షాలు వరదల కారణంగా రాష్ట్రంలోని మొత్తం 35 జిల్లాల్లో 30 జిల్లాలు వర్షాలు, వరదల తాకిడికి గురయ్యాయి. దాదాపుగా 46 లక్షల మంది ప్రజలు వరదల ప్రభావానికి గురయ్యారు. ఇప్పటి వరకు వరదల కారణంగా 118 మంది మరణించారు. గడిచిన 24 గంటల్లోనే 10 మంది వరదల కారణంగా మరణించారు. బ్రహ్మపుత్ర, బరాక్ నదులు ప్రమాదకరస్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. వరదలతో విలవిల్లాడుతున్న అస్సాంకు…