Illicit Affair: వివాహేతర సంబంధాలు కన్నవారి ఉసురుతీస్తున్నాయి. క్షణ కాలం సుఖం కోసం బంగారం లాంటి కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నారు. భర్తలను హతమార్చడం, పిల్లలను చంపడం వంటి సంఘటనలు ఇటీవల కాలంలో చాలా చోట్ల జరిగాయి. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ లో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. తమ బంధానికి అడ్డుగా వస్తున్నారని ప్రియుడి సహాయంతో ఓ తల్లి కొడుకు, కూతుర్ని హత్య చేసింది.
వివాహేతర సంబంధాలు వ్యక్తుల ప్రాణాలు తీసే దాకా వెళ్తున్నాయి. చాలా వరకు వివాహేతర సంబంధాల వల్లే దారుణ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఎక్కడ వివాహితల హత్యలు, భర్తల హత్యలు జరిగినా దాదాపు వివాహేతర సంబంధాలే కారణాలుగా కనిపిస్తున్నాయి.