అమెరికా నుంచి భారతదేశానికి అక్రమ వలసదారులు తిరిగి వచ్చారు. ఈ అంశంపై మొదటిసారిగా విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ స్పందించారు. చట్టవిరుద్ధంగా నివసిస్తున్న పౌరులను తిరిగి స్వదేశానికి తీసుకురావడం దేశాల బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. అమెరికాలో అక్రమ వలసదారులుగా ప్రకటించిన 104 మంది భారతీయులు బుధవారం పంజాబ్‌లోని అమృత్సర్‌కు తిరిగి వచ్చారు. ఆ విమానం బుధవారం శ్రీ గురు రామ్‌దాస్ జీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది.
హెచ్-1బీ వీసాదారులైన భారతీయులకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారీ ఉపశమనం ప్రకటించారు. NYT ప్రకారం.. ఈ వీసాలు నిలిపివేయబడవని ట్రంప్ అన్నారు. అమెరికాకు ప్రతిభ కావాలని.. తమకు ఇంజనీర్లు మాత్రమే అవసరమని ట్రంప్ పేర్కొన్నట్లు ఓ మీడియా సంస్థ తెలిపింది. H-1బీపై జరుగుతున్న చర్చ గురించి ట్రంప్‌ను ప్రశ్నించగా.. "నేను అనుకూల, ప్రతికూల వాదనలతో ఏకీభవిస్తున్నాను. ప్రస్తుతం అమెరికాకు అవసరమైన ప్రతిభను ఈ వీసా ప్రోగ్రామ్ ద్వారా మాత్రమే కనుగొనవచ్చు. ఈ వీసాలు నిలిపి వేయం."…
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ జనవరి 20న ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన మొదటి వారంలోనే ఆయన చేసిన ప్రకటనతో అమెరికాలో నివసిస్తున్న వలసదారులలో భయాందోళనలు నెలకొన్నాయి. అమెరికాలోని చాలా మంది భారతీయ విద్యార్థులు కళాశాల సమయం ముగిసిన తర్వాత పార్ట్ టైమ్ పని చేస్తూ డబ్బు సంపాదించేవారు. ఇప్పుడు వారు తమ పనిని వదిలివేశారు. ఓ జాతీయ మీడియాతో అక్కడున్న కొందరు విద్యార్థులు మాట్లాడారు. ఈ విద్యార్థులలో కొందరు, యూఎస్‌లో మనుగడ సాగించడానికి…
డొనాల్డ్ ట్రంప్ అధికారం చేపట్టిన 72 గంటల్లోనే అక్రమ వలసదారులపై ప్రభుత్వం భారీ చర్యలు ప్రారంభించింది. దీంతో డ్రీమ్‌ను వెతుక్కుంటూ అమెరికాకు వచ్చిన లక్షల మంది వలసదారులపై అధికారులు అతి పెద్ద ఆపరేషన్‌కు శ్రీకారం చుట్టారు. 12 నుంచి 15 గంటల్లోనే ట్రంప్ ప్రభుత్వం వేలాది మంది అక్రమ వలసదారులను అరెస్టు చేసి అదుపులోకి తీసుకుంది. ఇప్పటివరకు 538 మంది అక్రమ వలసదారులను అరెస్టు చేశామని, 373 మందిని అదుపులోకి తీసుకుని శిబిరాలకు పంపామని వైట్‌హౌస్ ట్వీట్…
పాకిస్థాన్ ప్రభుత్వం చేపట్టిన బహిష్కరణ డ్రైవ్‌లో భాగంగా ఇప్పటికే 5 లక్షల మందికి పైగా అక్రమ వలసదారులను దేశం నుంచి బహిష్కరించినట్లు పాక్ హోం మంత్రిత్వ శాఖ పార్లమెంటు ఎగువ సభ (సెనేట్)కి తెలియజేసింది.
Illegal Immigrant: అగ్రరాజ్యం అమెరికా వలసల సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. చాలా ఏళ్లుగా అక్రమ వలసదారులు ఆ దేశంలోకి ప్రవేశిస్తున్నారు. మెరుగైన అవకాశాలు, జీవనోపాధి పలు దేశాలను అమెరికా వైపు ఆకర్షిస్తున్నాయి. ఈ అక్రమ వలసదారుల జాబితాలో భారతీయులు కూడా ఉన్నారు.
Pakistan: పొరుగు దేశం పాకిస్థాన్ అక్రమ వలసదారులను దేశం నుంచి తరిమేస్తోంది. ఈ వలసదారులలో అత్యధిక సంఖ్యలో ఆఫ్ఘనిస్తాన్ నుండి వచ్చారు. వీరి సంఖ్య దాదాపు 17 లక్షలు. అక్రమ వలసదారులు దేశం విడిచి వెళ్లేందుకు పాకిస్థాన్ అక్టోబర్ 31 వరకు గడువు ఇచ్చింది.