Pakistan: నేటితో ముగియనున్న డెడ్ లైన్.. ఇప్పటి వరకు ఎంతమంది దేశాన్ని వదిలేశారంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పొరుగు దేశం పాకిస్థాన్ అక్రమ వలసదారులను దేశం నుంచి తరిమేస్తోంది. ఈ వలసదారులలో అత్యధిక సంఖ్యలో ఆఫ్ఘనిస్తాన్ నుండి వచ్చారు. వీరి సంఖ్య దాదాపు 17 లక్షలు. అక్రమ వలసదారులు దేశం విడిచి వెళ్లేందుకు పాకిస్థాన్ అక్టోబర్ 31 వరకు గడువు ఇచ్చింది. అది నేటితో ముగుస్తుంది. గడువుకు సంబంధించి పాకిస్థాన్ తాత్కాలిక హోం మంత్రి సర్ఫరాజ్ బుగ్తీ మాట్లాడుతూ.. అక్రమ వలసదారులు తమంతట తాముగా దేశం విడిచి వెళ్లకపోతే, ఆపద్ధర్మ ప్రభుత్వం వారిని దశలవారీగా బహిష్కరించడం ప్రారంభిస్తుందని అన్నారు. పాకిస్తాన్ ప్రభుత్వం ఇప్పుడు దశలవారీగా అక్రమ వలసదారులను బహిష్కరించే ప్రచారాన్ని ప్రారంభించబోతోందని సర్ఫరాజ్ బుగ్తీ హెచ్చరికను ఉద్దేశిస్తూ ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ వార్తాపత్రిక పేర్కొంది. గత మూడు రోజుల్లో 20 వేల మందికి పైగా అక్రమ వలసదారులు పాకిస్తాన్ నుండి బహిష్కరించబడ్డారు. వీరిలో అత్యధిక సంఖ్యలో ఆఫ్ఘన్లు ఉన్నారు.
Read Also:IQOO 12 Launch: నవంబర్ 7న ‘ఐకూ 12’ స్మార్ట్‌ఫోన్ లాంచ్.. సూపర్ డిజైన్, హై ఎండ్ ఫీచర్స్!
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
అక్రమ వలసదారులను బహిష్కరించే ప్రచారంలో అన్ని ప్రావిన్సుల ప్రభుత్వాలు ముఖ్యమైన సహకారం అందిస్తాయని పాకిస్థాన్ ప్రభుత్వం తెలిపింది. పాకిస్థాన్ తాత్కాలిక ప్రభుత్వం డివిజన్, జిల్లా స్థాయిలలో కమిటీలను ఏర్పాటు చేసింది. తొలి దశలో ఎలాంటి ప్రయాణ పత్రాలు లేని వారిని బయటకు పంపిస్తామని సర్ఫరాజ్ బుగ్తీ తెలిపారు. తర్వాత ఈ వ్యక్తులను ప్రభుత్వ తాత్కాలిక కేంద్రాలకు తీసుకువెళతారు. అక్కడ వారికి అన్ని ప్రాథమిక సౌకర్యాలు అందించబడతాయి. చాలా మంది అక్రమ వలసదారులు పాకిస్థాన్‌లో ఏళ్ల తరబడి నివసిస్తున్నారు. ప్రభుత్వం జియో మ్యాపింగ్‌ను పూర్తి చేసిందని, ఎక్కడ అక్రమ విదేశీ పౌరులు ఉంటే వారిని గుర్తిస్తామని సర్ఫరాజ్ బుగ్తీ చెప్పారు. పౌరసత్వంతో సంబంధం లేకుండా అక్రమ వలసదారులందరికీ ఈ పథకం వర్తిస్తుందని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..