HYDRA : శంషాబాద్ లో సోమవారం ఉదయం హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని సంపత్ నగర్, ఊట్పల్లి లో అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. సంపత్ నగర్ లో ప్రభుత్వ భూమి ఆక్రమించి కబ్జా చేసిన కట్టడాలను, ఊట్పల్లి లో రోడ్డు ఆక్రమించి అడ్డంగా గేటు ఏర్పాటు చేయడంతో రెండిటిని హైడ్రా అధికారులు కూల్చివేశారు. ఉదయం నుంచి కూల్చివేతలు కొనసాగాయి. ప్రభుత్వ భూములు, నాళాలు, చెరువులు, పార్కు స్థలాలు ఆక్రమిస్తే చర్యలు చేపడతామని హైడ్రా అధికారులు మరోసారి హెచ్చరికలు జారీ చేశారు.
Municipal Chairperson: నేడు హిందూపురంలో 144 సెక్షన్..
ఇదిలా ఉంటే.. ఇవాళ బుద్ద భవన్ లో హైడ్రా ప్రజావాణి జరుగనుంది. గ్రేటర్ పరిధిలో హైడ్రా ప్రజావాణి కి ప్రజల మద్దతు పెరిగింది. ప్రజావాణిలో నేరుగా కమిషనర్ రంగనాథ్‌కు కలిసి ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. దీంతో.. హైడ్రా ప్రజావాణి లో ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న ల్యాండ్ ఇష్యూస్ తెరపైకి వస్తున్నాయి. కొన్ని చోట్ల రాజకీయ పలుకుబడితో చేసిన కబ్జాలు బయట పడుతున్నాయి. పూర్తి స్థాయి ఆధారాలు ఉన్న సమస్యలపై వెంటనే స్పందించి చర్యలకు అదేశిస్తున్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు హైడ్రా ప్రజావాణి జరగనుంది. ప్రజావాణి ప్రారంభానికి ముందే బుద్ద భవన్ కి వచ్చి ఎదురు చూస్తున్నారు భాదితులు. వచ్చిన బాధితులకు టోకెన్ పద్ధతిలో ప్రజావాణికి అనమతిస్తున్నారు హైడ్రా సిబ్బంది..
Tamannaah Bhatia: నా శరీరానికి నేను రుణపడి ఉంటాను : తమన్నా