ఏటూ చూసిన శివనామస్మరణ.. అడుగడుగునా పంచాక్షరి పలుకులు.. అహా ఇది కైలాసమా అనట్టు ఉండే వేదిక.. ఆ వేదికను అలంకరించిన దైవ స్వరూపులైన పెద్దలు.. ఏమి చెప్పమంటారు కోటి దీపోత్సవ కళాశోభ.. ఇక బంగారు లింగోద్భవ ఘట్టం గురించి చెప్పాలంటే.. మాటలు రావడం లేదు.. కోటి దీపోత్సవ ప్రాంగణంలో అడుగుపెట్టిన మొదలు బయటికి వచ్చే వరకు కార్తీకమాసంలో కైలాసం దర్శనం జరుగుతోందనే భావన తప్ప మరేది మదిలోకి రాదు అనడం అతిశయోక్తి లేదు. మంగళవాయిద్యాలు నడుమ స్వామి…