తెలుగుదేశం పార్టీకి తిరుగులేని ఆధిపత్యం ఉన్న అసెంబ్లీ నియోజకవర్గం ఇచ్ఛాపురం. ఇక్కడి నుంచి ఆ పార్టీ తరపున హ్యాట్రిక్ కొట్టారు ఎమ్మెల్యే బెందాళం అశోక్. ప్రస్తుతం ప్రభుత్వ విప్ పదవిలో కూడా ఉన్నారాయన. అయితే... ఇన్నేళ్ళ సంగతి ఎలా ఉన్నా... ఇప్పుడు మాత్రం ద్వితీయ శ్రేణి నాయకులే ఆయన మీద గుర్రుగా ఉన్నారట. అదే సమయంలో ఇన్నిసార్లు గెలిపిస్తే.. నియోజకవర్గానికి ఏం ఒరగబెట్టారు సార్.. అన్న ప్రశ్నలు సైతం ప్రజల నుంచి మొదలవుతున్నాయి.
శ్రీకాకుళం జిల్లాలో భూ ప్రకంపనలు.. ప్రజలను భయాందోళనకు గురిచేశాయి.. జిల్లాలోని ఇచ్చాపురం పరిసర ప్రాంతాల్లో వరుసగా రెండుసార్లు భూమి కంపించింది.. తెల్లవారుజామున 3:40 గంటల ప్రాంతంలో స్వల్ప భూకంపం చోటు చేసుకోగా.. ఒక్కసారిగా ఉలిక్కిపడిన ప్రజలు.. భయాందోళనకు లోనయ్యారు.. మరోసారి ఉదయం 4:03 గంటల సమయంలో భూ ప్రకంపనలు సంభవించాయి..