2023 World Cup Tickets: నేడే ప్రపంచకప్ 2023 టిక్కెట్ల రిజిస్ట్రేషన్.. ఎప్పుడు, ఎక్కడంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Registration of ICC ODI World Cup 2023 Tickets will start from Today 3.30 PM on ICC Website: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 ఆరంభానికి ఇంకా 50 రోజులు మాత్రమే ఉంది. భారత్ గడ్డపై అక్టోబరు-నవంబరులో మెగా టోర్నీ జరగనుంది. అక్టోబర్ 5న ఆరంభం కానున్న ప్రపంచకప్ 2023 మ్యాచ్‌లకు సంబంధించిన టిక్కెట్ల విక్రయం ఆగస్టు 25 నుంచి ప్రారంభమవుతుందని ఐసీసీ ఇప్పటికే అధికారికంగా వెల్లడించింది. అయితే మెగా టోర్నీ టిక్కెట్లు కొనాలనుకునేవారు నేటి (ఆగస్టు 15) నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. https://www.cricketworldcup.com/register పేజీ లేదా ఐసీసీ వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
ఆగస్టు 15న మధ్యాహ్నం 3.30 నుంచి ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023కి సంబందించిన టిక్కెట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుంది. రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే టిక్కెట్ కొనుగోలు చేయొచ్చు. ఫాన్స్ ఇక ఆలస్యం ఎందుకు మరి.. సిద్ధంగా ఉండండి. మెగా టోర్నీకి ఈ-టిక్కెట్ ఆప్షన్ లేదు. అభిమానులు కచ్చితంగా బాక్స్ ఆఫీస్ కౌంటర్ల నుంచి టిక్కెట్లను తీసుకోవాల్సి ఉంటుంది. ఇక టిక్కెట్ల విక్రయం ఆగస్టు 25 నుంచి ప్రారంభమవుతుంది.
Also Read
- ICC Rankings: ఆసియా కప్ దెబ్బకు ఐసీసీ ర్యాంకింగ్స్ తారుమారు.. టాప్‌లోకి దూసుకెళ్లిన ఇండియన్ ప్లేయర్స్..
- Saudi-Israel: హౌతీల నుంచి భారీ ముప్పు.. ఇజ్రాయెల్ సాయం కోరిన సౌదీ!
- Irctc Tickets Booking: OpenAI మరో సంచలనం.. ఏఐతో ఆటోమేటిక్‌గా రైలు టికెట్లు బుకింగ్
- Saudi-Houthis: దాడులు తీవ్రం చేసిన హౌతీలు.. అప్రమత్తంగా ఉండాలని పౌరులకు సౌదీ హెచ్చరిక
ఈ మెగా వెంట్‌కు ‘బుక్‌మైషో’ అధికారిక టిక్కెట్ భాగస్వామి అని సమాచారం తెలుస్తోంది. తాజాగా బుక్‌మైషోతో డీల్ పూర్తయిందట. ఈ నేపథ్యంలో ప్రపంచకప్‌కు అధికారిక టిక్కెట్ భాగస్వామిగా బుక్‌మైషోను ఐసీసీ, బీసీసీఐ త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. ఇదే నిజమైతే బుక్‌మైషోలో అభిమానులు తమ ఇష్టమైన గేమ్ కోసం టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు.
వన్డే ప్రపంచప్ 2023 మ్యాచ్‌ల టిక్కెట్ల అమ్మకాలను ఐసీసీ రెండు రకాలుగా విభజించింది. భారత్ ఆడే వామప్, ప్రధాన మ్యాచ్‌లు.. భారత్ ఆడని ఇతర మ్యాచ్‌లు అని రెండు రకాలుగా టిక్కెట్ల అమ్మకాలు ఉంటాయి. భారత్ ఆడే 9 లీగ్ మ్యాచ్‌ల టికెట్లు 6 వేర్వేరు దశల్లో అమ్మకానికి ఉన్నాయి. ఆగస్టు 25న హైదరాబాద్‌లో జరిగే మ్యాచ్‌ల టిక్కెట్లు అమ్మకానికి ఉంటాయి.
Also Read: Jasprit Bumrah Back: ఐర్లాండ్‌కు టీమిండియా.. కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా లుక్ వైరల్!
టికెట్ల అమ్మకపు తేదీలు:
25 ఆగస్టు: భారత్ మినహా మిగతా జట్ల వామప్ మ్యాచ్‌లు, భారత్ మినహా ప్రధాన మ్యాచ్‌లు
30 ఆగస్టు: భారత్ వామప్ మ్యాచ్‌లు (గువహటి, తిరువనంతపురం)
31 ఆగస్టు: భారత్ మ్యాచ్‌లు (చెన్నై-ఆస్ట్రేలియా), (ఢిల్లీ-అఫ్గానిస్తాన్), (పుణే-బంగ్లాదేశ్)
1 సెప్టెంబర్: భారత్ మ్యాచ్‌లు (ధర్మశాల-న్యూజిలాండ్), (లక్నో-ఇంగ్లండ్), (ముంబై-శ్రీలంక)
2 సెప్టెంబర్: భారత్ మ్యాచ్‌లు (బెంగళూరు-నెదర్లాండ్స్), (కోల్‌కతా-దక్షిణాఫ్రికా)
3 సెప్టెంబర్: భారత్ మ్యాచ్ (అహ్మదాబాద్-పాకిస్తాన్)
15 సెప్టెంబర్: సెమీ ఫైనల్స్, ఫైనల్ మ్యాచ్‌లు
The registration for 2023 World Cup tickets will start from 3.30pm on the ICC Website. pic.twitter.com/oD6Aj6Iaz7
— Mufaddal Vohra (@mufaddal_vohra) August 15, 2023
తాజావార్తలు
-
ICC Rankings: ఆసియా కప్ దెబ్బకు ఐసీసీ ర్యాంకింగ్స్ తారుమారు.. టాప్‌లోకి దూసుకెళ్లిన ఇండియన్ ప్లేయర్స్..
-
Chandrasekhar Reddy: గేట్లు బద్దలు కొట్టి, సెక్యూరిటీని బెదిరించి.. అల్లు అర్జున్ మామ దౌర్జన్యం..?
-
Saudi-Israel: హౌతీల నుంచి భారీ ముప్పు.. ఇజ్రాయెల్ సాయం కోరిన సౌదీ!
-
Irctc Tickets Booking: OpenAI మరో సంచలనం.. ఏఐతో ఆటోమేటిక్‌గా రైలు టికెట్లు బుకింగ్
-
CV Anand : పంతాలకు పోవద్దు.. పదోన్నతులు కోల్పోవద్దు
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్‌ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?