వన్డే వరల్డ్ కప్-2023కు ముందు న్యూజిలాండ్ క్రికెట్ జట్టుకు మంచి శుభవార్త అందే ఛాన్స్ కనిపిస్తుంది. గాయం కారణంగా జట్టుకు దూరంగా ఉన్న కెప్టెన్ కేన్ విలియమ్సన్ వన్డే వరల్డ్ కప్ సమయానికి అందుబాటులో ఉండనున్నట్లు సమాచారం.
బీసీసీఐ షార్ట్ లిస్టు చేసిన వేదికల జాబితాలో హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం ఒక్కటి.. అయితే ఉప్పల్‌లో మాత్రం భారత జట్టు ఆడే సూచనలు కన్పించడం లేదు. భారత జట్టు ఆడే మ్యాచ్‌లకు సంబంధించి బీసీసీఐ సిద్దం చేసిన డ్రాప్ట్ షెడ్యూల్‌లో ఉప్పల్ స్టేడియం పేరు లేనట్లు కనిపిస్తుంది.
ODI World Cup: ఈ ఏడాది భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్ జరగబోతోంది. దీని కోసం బీసీసీఐ సిద్ధమవుతోంది. ఈ ఏడాది చివర్లో ప్రపంచకప్ జరగనుంది. జూన్ 7 నుండి భారత్ మరియు ఆస్ట్రేలియా మధ్య ఓవల్‌లో జరిగే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ తర్వాత 2023 ప్రపంచకప్ షెడ్యూల్ ప్రకటిస్తామని బీసీసీఐ కార్యదర్శి జైషా తెలిపారు.