అంతర్జాతీయ వన్డే ర్యాంకింగ్స్‌లో పాకిస్తాన్ నెంబర్-1 స్థానానికి చేరుకుంది. శ్రీలంక వేదికగా ఆఫ్గానిస్తాన్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను పాక్ క్లీన్ స్వీప్ చేయడంతో.. మళ్లీ నెంబర్-1 వన్డే జట్టుగా నిలిచింది. ఈ క్రమంలో ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టి బాబర్ సేన టాప్ ర్యాంక్‌ను సొంతం చేసుకుంది.
అంతర్జాతీయ క్రికెట్ మండలి తాజాగా ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్ లో పాకిస్తాన్.. 113 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. తాజా ర్యాంకింగ్స్ ప్రకారం పాకిస్తాన్ 113 పాయింట్లతో తొలి స్థానంలో నిలవగా.. రెండు, మూడు స్థానాల్లో ఉన్న ఆస్ట్రేలియా, భారత్ కూడా 113 పాయింట్లతోనే ఉండటం గమనార్హం.
ICC Latest ODI Rankings: ఐసీసీ తాజాగా ప్రకటించిన వన్డే ర్యాంకుల్లో టాప్-10 జాబితాలో టీమిండియా నుంచి ఇద్దరే ఆటగాళ్లకు చోటు దక్కింది. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒక పాయింట్ కోల్పోయి నాలుగో స్థానానికి పడిపోయాడు. అతడి ఖాతాలో 790 పాయింట్లు ఉన్నాయి. అటు ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు. రోహిత్ ఖాతాలో 786 పాయింట్లు ఉన్నాయి. వన్డే ర్యాంకుల్లో పాకిస్థాన్ ఆటగాడు బాబర్ ఆజమ్ 892 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.…
ICC ODI Rankings: ఇంగ్లండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకున్న టీమిండియా ఐసీసీ వన్డే ర్యాంకుల్లోనూ జోరు చూపించింది. వన్డే ర్యాంకింగ్స్‌లో పాకిస్థాన్‌ను నాలుగో స్థానానికి నెట్టిన టీమిండియా 109 పాయింట్లతో మూడో స్థానానికి చేరింది. పాకిస్థాన్ ఖాతాలో 106 పాయింట్లు ఉన్నాయి. వన్డే ర్యాంకుల్లో న్యూజిలాండ్ 128 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. టీమిండియాతో వన్డే సిరీస్ కోల్పోయినా 121 పాయింట్లతో ఇంగ్లండ్ రెండో స్థానాన్ని నిలబెట్టుకుంది. అటు 101 పాయింట్లతో ఆస్ట్రేలియా…
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో నిన్నటిదాకా భారత్ నాలుగో స్థానంలో ఉండేది. కానీ.. పాకిస్తాన్ ఇప్పుడు భారత్‌ను వెనక్కు నెట్టేసి, ఆ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇటీవల స్వదేశంలో వెస్టిండీస్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను పాక్ క్లీన్ స్వీప్ చేసింది. ఫలితంగా పాక్ ఖాతాలో 4 పాయింట్లు వచ్చి చేరాయి. దీంతో, మొత్తంగా 106 పాయింట్లతో ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో పాక్ నాలుగో స్థానానికి ఎగబాకింది. టీమిండియా 105 పాయింట్లతో ఐదో స్థానానికి పరిమితం అయ్యింది. తొలి…