ఏపీలో భారీగా ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు శనివారం ఏపీ సీఎస్ నీరభ్‌కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 62 మంది ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఓవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ జవహర్‌రెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. మరోవైపు.. కీలక ఐఏఎస్ అధికారులను కూడా బదిలీ చేసింది.. సీఎంవో స్పెషల్ సీఎస్‌గా పూనం మాలకొండయ్య, వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్‌గా మధుసూదన రెడ్డి, పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శిగా ప్రవీణ్ ప్రకాష్‌ను బదిలీ చేశారు.. ఇక, సెలవుపై వెళ్లిన బుడితి రాజశేఖర్‌ను.. సెలవు నుంచి తిరిగొచ్చిన తర్వాత జీఏడీకి రిపోర్ట్ చేయాలని ఆదేశించింది ప్రభుత్వం.. ఆర్…