ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ వ్యవహారం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. తవ్వేకొద్దీ అక్రమాలు బయటకు వస్తూనే ఉన్నాయి. ఇప్పటికే అనేక ఆరోపణలు రావడంతో ఆమె శిక్షణ కార్యక్రమాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసింది. అయినా కూడా ఆమెకు సంబంధించిన వివాదాల పరంపర కొనసాగుతూనే ఉంది. రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది.
Puja Khedkar : ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ తల్లి తుపాకీతో రైతును బెదిరించిన వీడియో వైరల్‌గా మారింది. ఆ తర్వాత ఆమెపై రైతు ఎఫ్ఐఆర్ నమోదు చేశాడు. సోమవారం పూణె రూరల్ పోలీసులు వచ్చి ఆమెను విచారించగా, ఆమె ఇంట్లో కనిపించలేదు.
CM Nitish Kumar: బీహార్ సీఎం నితీష్ కుమార్ వార్తల్లో వ్యక్తిగా మారారు. మౌలిక సదుపాయాల పనుల్ని వేగవంతం చేయాలని కోరుతూ, నితీష్ చేతులు జోడించి వేడుకోవడం వైరల్‌గా మారింది.
కర్ణాటక రాష్ట్రంలో తెలుగు ఐఏఎస్ అధికారిణి రోహిణి సింధూరి మరో వివాదంలో చిక్కుకున్నారు. తన భూమిని ఆక్రమించారని ఆరోపిస్తూ ఆమెపై బాలీవుడ్ సింగర్ లక్కీ అలీ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఫిర్యాదు కాపీని ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు.
తమిళనాడు మాజీ డీజీపీ రాజేశ్ దాస్-మాజీ భార్య బీలా వెంకటేశన్ ఇంటిపోరు రచ్చకెక్కింది. రాజేశ్ దాస్ నివాసం ఉంటున్న ఇంటికి కరెంట్ కనెక్షన్‌ను బీలా తొలగించేశారు.
అది ప్రభుత్వాస్పత్రి.. లోపల ఏం జరుగుతుందో.. రోగులకు ఎలాంటి వైద్యం అందుతుందో.. డాక్టర్లు, సిబ్బంది ఎలా పని చేస్తున్నారో తెలుసుకోవాలనుకున్నారు ఐఏఎస్ ఆఫీసర్.
ఓ కుక్క కారణంగా ఐఏఎస్ అధికారిణి తన ఉద్యోగం పోగొట్టుకుంది. సోషల్ మీడియా, మీడియా ఛానళ్లు విపరీతంగా ఉన్న ప్రస్తుతం కాలంలో ఉన్నతాధికారిని అని ఎలా పడితే అలా ప్రవర్తిస్తే పదవి ఊడపోతుందని నిరూపితమయ్యింది. ఈ ఘటన న్యూఢిల్లీలో జరిగింది. పెంపుడు కుక్కను వాకింగ్ చేయించేందుకు మైదానంలోని క్రీడాకారులను పంపించేసింది ఐఏఎస్ అధికారిణి రింకూ దుగ్గా. ఢిల్లీలోని త్యాగరాజ్ స్టేడియంలో తన పెంపుడు కుక్కను వాకింగ్ చేయించేందుకు తీసుకువెళ్లారు ఐఏఎస్ అధికారిణి రింకూ దుగ్గా దంపతులు. కుక్కను…
ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన బొగ్గు లెవీ కుంభకోణానికి సహకరించారనే ఆరోపణలతో ఐఏఎస్ అధికారిణి రాను సాహును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు.
రిటైర్డ్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ (ఐఏఎస్) అధికారి, మధ్యప్రదేశ్ తొలి మహిళా ప్రధాన కార్యదర్శి నిర్మలా బుచ్ వృద్ధాప్య సంబంధిత అనారోగ్యంతో ఆదివారం ఇక్కడ మరణించారని కుటుంబ వర్గాలు తెలిపాయి.
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో భారీగా లిక్కర్ అక్రమాలు జరిగాయని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ప్రకటింది. ఛత్తీస్గఢ్ మద్యం కుంభకోణంలో భారీ అవినీతి బట్టబయలైనట్టు ఈడీ ఆరోపణలు చేసింది. ఏకంగా రూ.2వేల కోట్ల అవినీతిని గుర్తించినట్టు వెల్లడించింది. ఈ అవినీతి సొమ్మును ఎన్నికలకు మళ్లిస్తున్నట్లు ఆరోపణలు చేసింది.