తమిళనాడు మాజీ డీజీపీ రాజేశ్ దాస్-మాజీ భార్య బీలా వెంకటేశన్ ఇంటిపోరు రచ్చకెక్కింది. రాజేశ్ దాస్ నివాసం ఉంటున్న ఇంటికి కరెంట్ కనెక్షన్‌ను బీలా తొలగించేశారు. విడాకులకు ముందు జాయింట్ లోన్‌తో ఇల్లు కొన్నారు. కరెంట్ కనెక్షన్ మాత్రం తన పేరిట ఉందని ఆమె తెలిపారు. అందుకే తొలగించినట్లు ఆమె చెప్పారు. కానీ తనను వేధించేందుకే బీలా విద్యుత్ శాఖ సెక్రటరీ అధికారాన్ని దుర్వినియోగం చేస్తోందని దాస్ ఆరోపించారు.
ఇది కూడా చదవండి: Tollywood Heroes : హైయేస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న యంగ్ హీరోలు వీరే..
2023లో విల్లుపురంలోని ట్రయల్ కోర్టు రాజేష్ దాస్ తన కింద పనిచేస్తున్న మహిళా ఐపీఎస్ అధికారిని లైంగికంగా వేధించిన కేసులో దోషిగా తేల్చింది. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ స్పెషల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రాజేష్ దాస్ తమిళనాడులోని చెన్నైలో తన ఇంటికి సోమవారం (మే 20న) విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో చీకటిలో ఉండిపోయారు. ఆయన మాజీ భార్య బీలా వెంకటేశన్‌పై ఆయన ఆరోపణలు చేశారు. రాష్ట్ర ఇంధన కార్యదర్శిగా ఉన్న ఆమె.. తాను నివాసం ఉంటున్న ఇంటికి విద్యుత్‌ను డిస్‌కనెక్ట్ చేసి ఆమెకు ఉన్న అధికారాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించారు.
ఇది కూడా చదవండి: Jayam Sada Sister: జయం మూవీలో సదా చెల్లెలి లేటెస్ట్ లుక్.. పెళ్లి చేసుకుని పిల్లలు కూడా?
తమిళనాడు జనరేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ అధికారులు మే 19, ఆదివారం విద్యుత్ సరఫరాను డిస్‌కనెక్ట్ చేయడానికి రాజేష్ దాస్ ఇంటికి వెళ్లారు. అయితే వారి ప్రయత్నాలను దాస్ ప్రతిఘటించడంతో వారు వెళ్లిపోయారు. రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి లేఖతో అధికారులు సోమవారం తిరిగి వచ్చి విద్యుత్ సరఫరాను నిలిపివేశారు.
అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనే ఆరోపణలపై బీలా స్పందిస్తూ.. గత మూడు నెలలుగా ఇల్లు ఖాళీగా ఉందని, కనెక్షన్, భూమి తన పేరు మీద ఉన్నందున అనవసరంగా కరెంటు బిల్లుల కోసం డబ్బు ఖర్చు చేయకూడదని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అధికారులు వారి బాధ్యతను నెరవేర్చారని తెలిపారు.
2023లో విల్లుపురంలోని ట్రయల్ కోర్టు రాజేష్ దాస్ తన కింద పనిచేస్తున్న మహిళా ఐపీఎస్ అధికారిని లైంగికంగా వేధించిన కేసులో దోషిగా నిర్ధారించింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో అతను రెండు పిటిషన్లతో మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. ఒకటి శిక్షను నిలిపివేయాలని, మరొకటి ట్రయల్ కోర్టు ముందు లొంగిపోకుండా మినహాయింపు కోరుతూ పిటిషన్ వేశారు. కానీ రెండు పిటిషన్లు కొట్టేసింది. ఈ రెండు పిటిషన్‌లను హైకోర్టు కొట్టివేసినందుకు వ్యతిరేకంగా దాఖలైన అప్పీల్‌పై విచారణ సందర్భంగా మే 17న ఆయన అరెస్టుపై మధ్యంతర స్టే విధిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఇది కూడా చదవండి: Alcohol Withdrawal: ఒక్కసారిగా మద్యం మానేస్తే ఏమౌతుందో తెలుసా?