North Korea: దక్షిణ కొరియా, జపాన్‌లో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకన్ పర్యటిస్తున్న సందర్భంగా ఉత్తర కొరియా హైపర్ సోనిక్ క్షిపణిని పరీక్షించింది. దీంతో పసిఫిక్ సముద్రంలో ఉన్న ఏ శత్రువునైనా నమ్మకంగా ఈ మిస్సైల్ ఎదుర్కోగలదని నార్త్ కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ ప్రకటించారు.