దేశ భవిష్యత్ తరగతి గదుల్లో ఉంది.. అందరూ జీవితంలో రాణించేలా చదువుకోండి.. పిలిస్తే పలికేలా నేను ఉంటా.. పని చేస్తా.. యంగ్ ఇండియా నా బ్రాండ్.. నా బ్రాండ్ అంబాసిడర్లు మీరే అని పేర్కొన్నారు. అలాగే, ప్రజా ప్రభుత్వంలో దళిత బిడ్డలకు పట్టంకట్టాం.. కులం వల్ల ఎవరికీ సమాజంలో గుర్తింపు రాలేని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.
భారత రాష్ట్ర సమితిలో తన పాత్రపై స్పష్టత కోరుతున్న కవిత ఇక దూకుడు పెంచాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఏదో... ఇస్తే తీసుకున్నట్టు కాకుండా.... తానేంటో నిరూపించుకోవాలనుకుంటున్నారట ఆమె. తండ్రి కేసీఆర్కు ఆమె రాసిన లేఖ బయటికి లీకవడం, దాని మీద పెద్ద స్థాయిలో రాజకీయ రచ్చ అవుతున్న క్రమంలో కేసీఆర్ దూతలు ఇద్దరు కవితతో నేరుగా సమావేశమై చర్చించినట్టు తెలుస్తోంది.
CM Revanth Reddy: హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా ఎలాంటి నష్టం వాటిల్లకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. భారీ వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ ఇచ్చిన సూచనలకు అనుగుణంగా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
Rain In Hyderabad: నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దాదాపు అన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. ఇక, హైదరాబాద్ నగరంలో సాయంత్రం 7.30 గంటలకి వాన ప్రారంభమైంది.
Bhatti Vikramarka: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ముగ్గురు సీనియర్ ఉన్నతాధికారులతో కమిటీని ఏర్పాటు చేసింది. ఈరోజు ( మే 27వ తేదీ) రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో త్రిమెన్ కమిటీ అధికారుల సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఉద్యోగుల సమస్యలను డిప్యూటీ సీఎంకు వారు వివరించారు.
టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ మాట్లాడుతూ.. నిబద్దతతో పని చేస్తూ ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేరవేస్తోన్న ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమానికి యాజమాన్యం ప్రాధాన్యం ఇస్తోంది అన్నారు. ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు చెల్లింపు, 21 శాతం ఫిట్మెంట్ తో 2017 పీఆర్సీ, 2013 ఆర్పీఎస్ బాండ్ల డబ్బుల విడుదలతో పాటు పెండింగ్ డీఏలను మంజూరు చేసిందని గుర్తు చేశారు.
టాలీవుడ్లో భారీ అంచనాలతో రూపొందుతున్న పాన్-ఇండియా చిత్రం ‘కన్నప్ప’ తాజాగా ఒక అనూహ్య సంఘటనతో వార్తల్లో నిలిచింది. మంచు విష్ణు హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలోని కీలక వీఎఫ్ఎక్స్ డేటా మరియు ఒక ముఖ్యమైన యాక్షన్ సీక్వెన్స్ ఉన్న హార్డ్ డిస్క్ చోరీ అయినట్లు సమాచారం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై మంచు విష్ణు నిర్మాణ సంస్థ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. అయితే, ఈ ఘటనకు కారణమైన చరిత అనే మహిళపై…
టాలీవుడ్లో భారీ అంచనాలతో రూపొందుతున్న పాన్-ఇండియా చిత్రం ‘కన్నప్ప’ మరోసారి వార్తల్లో నిలిచింది. మంచు విష్ణు హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలోని కీలక దృశ్యాలు ఉన్న హార్డ్ డిస్క్ చోరీ అయినట్లు తాజాగా సమాచారం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై మంచు విష్ణు నిర్మాణ సంస్థ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ సంఘటన సినీ వర్గాల్లో సంచలనంగా మారడంతో పాటు, చిత్ర బృందానికి ఊహించని ఎదురుదెబ్బగా నిలిచింది. Also Read:Unni Mukundan…
దక్షిణాది సినీ పరిశ్రమలో తనదైన గుర్తింపు సంపాదించుకున్న విలక్షణ నటుడు విజయ్ సేతుపతి, డైనమిక్ దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఒక భారీ పాన్-ఇండియా చిత్రంలో హీరోగా నటించనున్నాడు. ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. పూరి కనెక్ట్స్ బ్యానర్పై పూరి జగన్నాథ్ మరియు ఛార్మి కౌర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే సినీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ALso Read: Kannappa: హార్డ్ డిస్క్ మిస్సింగ్..…