హైదరాబాద్ ఉప్పల్‌లో చైన్‌స్నాచింగ్‌కు పాల్పడ్డ ఇద్దరు మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి దగ్గర నుంచి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు మహిళలను కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించింది. దీంతో వారిని జైలుకు తరలించారు.
ఇది కూడా చదవండి: Kannappa : శివరాజ్ కుమార్ మూవీలో.. విలన్ రోల్ అడిగిన మోహన్ బాబు
ఉప్పల్‌కు చెందిన ఉషా , శిరీష చైన్‌స్నాచర్ల అవతారం ఎత్తారు. వర్ష బ్యాంగిల్ స్టోర్ నిర్వాహకురాలు సంధ్యపై పెప్పర్ స్ప్రే కొట్టి మూడు తులాల బంగారు గొలుసును లాక్కుని పరారయ్యారు. దీంతో బాధితురాలు సంధ్య ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇక రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించారు. 24 గంటల్లోనే నిందితులు ఉషా, శిరీష్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. విచారణలో ఆర్థిక ఇబ్బందులతోనే దొంగతనానికి పాల్పడినట్లు నిందితులు తెలిపారు. బంగారు గొలుసును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Acharya pramod krishnam: రాహుల్ గాంధీకి పాకిస్తాన్‌లో ఫుల్ క్రేజ్, అక్కడ పోటీ చేస్తే గెలుస్తాడు..