హైదరాబాద్లోని నారాయణగూడాలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. నారాయణగూడాలోని అవంతి నగర్లో ఓ ఇంట్లో అర్ధరాత్రి సమయంలో సడెన్ మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతం మొత్తం దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. వెంటనే స్పందించిన పోలీసులు ప్రమాదంలో చిక్కుకున్న ఐదుగురిని కాపాడి సమీపంలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. అయితే, ఈ ఆగ్ని ప్రమాదంలో ఒకరు మృతి చెందారని పోలీసులు పేర్కొన్నారు. ఇక, ఈ అగ్ని ప్రమాదం జరగడానికి షార్ట్ సర్క్యూట్ కారణమా లేదంటే మరేమైనా కారణాలు…
హైదరాబాద్లో ఓ బాలిక, ఆమె ప్రియుడు ఆత్మహత్యకు పాల్పడ్డారు.. రెండు రోజుల క్రితం ఇంటి నుంచి అదృశ్యమైన ఆ జంట.. ఇవాళ జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలయ్య నగర్ వద్ద ఉన్న క్వారీ నీటి గుంటలో శవాలుగా తేలారు.. నీటిపై తేలుతున్న మృతదేహాలను గుర్తించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. ఈ వ్యవహారం వెలుగుచూసింది.. అయితే, ఎల్లమ్మబండ ఎన్టీఆర్ నగర్ ప్రాంతానికి చెందిన మైనర్ బాలిక (17), విషాల్ (21) అనే జంట.. కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారని…
మామూలు రోజుల్లో ఆదివారం వస్తే ఉదయం మధ్యాహ్నం వరకు నాన్ వెజ్ మార్కెట్లు కిటకిటలాడుతున్నాయి. ఎటు చూసినా రద్దీ కనిపిస్తుంది. కానీ, ఇది కరోనా కాలం. నిబంధనలు అమలౌతున్న రోజులు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే సడలింపు ఉన్నది. దీంతో ఉదయం 6 గంటల నుంచి నాన్ వెజ్ మార్కెట్ల వద్ద పెద్ద ఎత్తున ప్రజలు చేరుకున్నారు. భారీ సంఖ్యలో క్యూలు కట్టారు. ముషీరాబాద్ చేపల మార్కెట్ వద్ద ఇసుకేస్తే రాలనంత మంది…
హైదరాబాద్ నగరంలో దొంగలు హల్ చల్ చేస్తున్నారు. కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో సొంతూళ్లకు ప్రయాణమయ్యారు నగరవాసులు. దీంతో చోరీలు ఎక్కువ అవుతున్నాయి. తాజాగా హైదరాబాద్ కుల్సుంపురా పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగలు బీభత్సం సృష్టించారు. జియాగూడ వెంకటేశ్వర నగర్ కాలనీలోని 5 ఇళ్లలో చోరీ చేశారు. 20 లక్షల నగదు, 45 తులాల బంగారం ఎత్తుకెళ్లినట్లు బాధితులు ఫిర్యాదు చేశారు. ఇంట్లో పెళ్లి ఉండడంతో సిద్ధం చేసిన 45 తులాల బంగారం, 20 లక్షలకుపైగా నగదు…
కరోనా సెకండ్ వేవ్ కేసులు భారీ సంఖ్యలో వెలుగుచూస్తోన్న తరుణంలో.. ఇప్పుడు బ్లాక్ ఫంగస్ కేసులు కొత్త టెన్షన్ పెడుతున్నాయి.. దేశ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఈ కేసులు నమోదు కాగా.. తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో పలు కేసులు వెలుగుచూశాయి.. తాజాగా ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలోనూ ఓ కేసు బయటపడింది. అయితే, బ్లాక్ ఫంగస్ కేసుల విషయంలో కీలక సూచనలు చేశారు తెలంగాణ డీఎంఈ.. తెలంగాణ హెల్త్ డైరెక్టర్… ముఖ్యంగా కోవిడ్ నుంచి కోలుకున్న కొన్ని కేసుల్లో బ్లాక్…
వరుసగా పెరిగిపోతోన్న కరోనా కేసులకు చెక్ పెట్టడమే లక్ష్యంగా లాక్డౌన్ విధించింది తెలంగాణ ప్రభుత్వం… అయితే, ప్రజలకు కూరగాయాలు, ఇతర నిత్యావసరాలకు ఇబ్బందిలేకుండా ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు సడలింపులు కల్పించింది.. కానీ, ఆ నాలుగు గంటలే ఇప్పుడు యమ డేంజర్ అని హెచ్చరిస్తున్నారు నిపుణులు.. ఎందుకంటే.. మార్కెట్లు, ఇతర ప్రాంతాల్లో ఎక్కడా.. భౌతిక దూరం పాటించడంలేదని.. కనీస జాగ్రత్తలు కూడా తీసుకోకుండా.. ఎగబడి మరి కూరగాయలు, పండ్లు ఇతర వస్తువులు కొనుగోలు…
సెకండ్ వేవ్ మొదలైనప్పటి నుంచి బంగారం ధరలు పెరగడం మొదలుపెట్టాయి. వినియోగదారులు బంగారంపై పెట్టుబడులు పెడితే సేఫ్ అనే ఉద్దేశ్యంతో వాటిపై పెట్టుబడులు పెడుతుండటంతో బంగారం ధరలు పెరిగాయి. అంతేకాదు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించే అవకాశం లేదని ప్రధాని స్పష్టం చేయడంతో ఆ ప్రభావం బంగారం ధరలపై పడింది. ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. పెరిగిన ధరల ప్రకారం ఈరోజు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల…
తెలంగాణలో లాక్ డౌన్ ఆంక్షలను కఠినంగా అమలు చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే రోగుల విషయంలో నిబంధనలు మరింత కఠినం చేసింది. తెలంగాణ బోర్డర్ లో ఏపీ నుంచి వచ్చే అంబులెన్స్ లను ఆపివేయడంపై ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణా రెడ్డి స్పందించారు. తెలంగాణ ప్రభుత్వం వాళ్ళ ప్రజల గురించి ఆలోచించడం సహజమే. హైకోర్టు చెప్పినప్పటికీ ప్రభుత్వం సాంకేతికంగా గైడ్ లైన్స్ పెట్టింది. ఆ గైడ్ లైన్స్ ను పాటించడం కష్టం అని అన్నారు. అంబులెన్స్ ను…
తెలంగాణలో రెండో రోజు లాక్ డౌన్ అమలు జరుగుతున్నది. ఉదయం నుంచి రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. ఉదయం 10 గంటల తరువాత రోడ్లపై ఉన్న వారిని వెనక్కి పంపించారు. సీపీ అంజనీకుమార్ లాక్ డౌన్ పై సమీక్షను నిర్వహించారు. లాక్ డౌన్ ను ప్రజలు కచ్చితంగా పాటించాలని అన్నారు. ప్రజలు ఇళ్లను విడిచి బయటకు రావొద్దని అన్నారు. రంజాన్ సందర్భంగా ప్రజలు ఇళ్లల్లోనే ప్రార్ధనలు జరుపుకోవాలని తెలిపారు. మసీదులో మౌలానాతో పాటు మరో ఇద్దరికి మాత్రమే అనుమతి ఉంటుందని, ఇంట్లో జరిగే ప్రార్థనల్లో కూడా…