అత్యంత విలువైనది వస్తువు బంగారం. ఈ బంగారాన్ని కొనుగోలు చేయడానికి చాలా మంది ఇష్టపడతారు. అయితే.. కొన్ని రోజులుగా బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. కరోనా నేపథ్యంలో పసిడి ధరలు పెరుగుతున్నాయని నిపుణులు అంటున్నారు. అయితే గత నాలుగు రోజుల నుంచి బంగారం ధరలు భారీగా పెరుగుతూ వస్తున్నాయి. ఇక ఈరోజు పెరిగిన ధరల ప్రకారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 10 పెరిగి రూ. 44,010 కి చేరింది. ఇక రూ. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 10 పెరిగి రూ. 48,010 కి చేరింది. బంగారం ధరలు పెరగగా…వెండి ధరలు మాత్రం స్థిరంగా నమోదయ్యాయి. కిలో వెండి ధర రూ. 68,200 వద్ద కొనసాగుతోంది.