ఈఏడాది కూడా స్వాతంత్ర్యదినోత్సవాన్ని గోల్కొండ కోటలోనే నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం.. ఈ నెల 15 వ తేది ఉదయం 10.30 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గోల్కొండ కోటలో జాతీయ జెండాను ఆవిష్కరిస్తారని తెలిపారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్… ఇవాళ బీఆర్కే భవన్లో సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించిన సీఎస్.. స్వాతంత్ర్యదినోత్సవం కోసం చేపట్టాల్సిన ఏర్పాట్లపై సమీక్షించారు.. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి కోవిడ్ నిబంధనలు పాటిస్తూ…
రోగి నుండి బంగారం చోరీ చేసిన ఘటన హైదరాబాద్ లోని కె.పి.హెచ్.బి పరిధిలో జరిగింది. ఈ నెల 5వ తేదీన హృద్రోగ సమస్యలతో శ్రీశ్రీ హోలిస్టిక్ ఆసుపత్రిలో బాధితురాలు చేరింది. వైద్యం కొరకు ఆసుపత్రికు వచ్చిన రోగి నుండి జక్కిరాముడు అనే వార్డు బాయ్ బంగారు ఆభరణాలు చోరీకి పాల్పడ్డాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అతన్ని కె.పి.హెచ్.బి పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె మెడలో ఉండాల్సిన మూడు తులాల బంగారు గొలుసు కనిపించకపోవటంతో ఆమె మనువడు…
హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం (GHIAL) స్కైట్రాక్స్ ప్రపంచ ఎయిర్ పోర్ట్స్ అవార్డులు-2021లో ‘బెస్ట్ రీజనల్ ఎయిర్పోర్ట్ ఇన్ ఇండియా & సెంట్రల్ ఏషియా’ అవార్డును గెల్చుకుంది. హైదరాబాద్ విమానాశ్రయం స్కైట్రాక్స్ అవార్డును గెల్చుకోవడం వరుసగా ఇది మూడోసారి. అలాగే ప్రపంచ టాప్ 100 విమానాశ్రయాలలో గత ఏడాది 71వ స్థానంలో ఉండగా, ఈ ఏడాది 64వ స్థానానికి చేరింది. హైదరాబాద్ విమానాశ్రయం ఈ క్రింది విభాగాలలో కూడా అవార్డులు గెల్చుకుంది: స్కైట్రాక్స్ కొన్ని నెలల క్రితం చాలా…
ఓ మాయలేడీ వలలో పడి న్యూడ్ వీడియో, ఫోటోలతో మోసపోయిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ లోని కొంపల్లి సినీ ప్లానెట్ సమీపంలోని ఓ యువకుడికి గత నెల 30న తన మొబైల్ వాట్సాప్ కు ఓ నంబర్ నుండి మెసేజ్ వచ్చింది. ఆ నెంబర్ అమ్మాయిదని తెలియడంతో సరదాగా చాటింగ్ సాగించాడు. ఆ పరిచయం పెరగడంతో యువకుడు ఆమె అడిగిన వెంటనే తన ఫేస్ బుక్ ఐడిని షేర్ చేశాడు.…
కింగ్ నాగార్జున, డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు కాంబినేషన్లో హైరేంజ్ యాక్షన్ థ్రిల్లర్ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర ఎల్ఎల్పి, నార్త్‌స్టార్ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై నారాయణ్ దాస్ కె. నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు, శరత్ మరార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రీసెంట్గా ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించారు. ఈ లెంగ్తీ షెడ్యూల్లో నాగార్జున, గుల్ పనాంగ్, అనిఖా సురేంద్రన్ తదితరులపై కీలక సన్నివేశాలను ప్రస్తుతం చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా మేకర్స్ లొకేషన్లో నాగార్జున వర్కింగ్…
తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలకు చెక్ పెట్టాలన్న ఉద్దేశంతో.. తెలుగు రాష్ట్రాల గుండా ప్రవహించే కృష్ణా, గోదావరి నదులకు సంబంధించిన కృష్ణా నది యాజమాన్యబోర్డు, గోదావరి నది యాజమాన్య బోర్డులకు విస్తృత అధికారాలు కల్పిస్తూ.. గెజిట్ విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం… అయితే, దీనిపై భిన్నమైన వాదనలు ఉన్నాయి.. దీంతో… ఈ నెల 9వ తేదీన కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ ఉమ్మడిగా అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశాయి… ఈ సమావేశానికి హాజరు కావాల్సిందిగా ఇరు రాష్ట్రాల…
సచివాలయ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తిచేయాలని ఏజెన్సీ ప్రతినిధులను, అధికారులను సిఎం కెసిఆర్ ఆదేశించారు. శనివారం సచివాలయ నిర్మాణ పనుల పురోగతిని సిఎం కేసీఆర్ పరిశీలించారు. నలుమూలలా కలియతిరిగి పరిశీలించారు. పరిపాలనకు కేంద్ర బిందువు గా వుండే సెక్రటేరియట్ నిర్మాణ కౌశలం మన పాలనారీతులకు అద్దం పట్టేవిధంగా ఉండాలని సిఎం అన్నారు. తెలంగాణ ఏర్పాటు అనంతర పరిస్థితుల్లో,సిబ్బంది మరింత ప్రశాంతంగా తమ విధులను నిర్వహించుకునే విధంగా సచివాలయ నిర్మాణం వుండబోతోందని తెలిపారు. గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు…
పసిడి ప్రేమికులకు గుడ్‌న్యూస్.. మరోసారి బంగారం ధర తగ్గింది.. గత కొన్ని రోజులుగా పెరిగిన పుత్తడి ధరలు.. నిన్న మరియు ఇవాళ కిందకు దిగుతూ కాస్త ఊరట కలిగించింది.. హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధర దిగొచ్చింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 820 తగ్గడంతో.. రూ.47,840కు దిగివచ్చింది. ఇక, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.750 తగ్గడంతో రూ. 43,850 కు క్షీణించింది. ఇవాళ బంగారం ధర తగ్గగా… మరోవైపు…
దేశంలో బంగారానికి డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. ఇక పెళ్లిళ్ల సీజన్లో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే… గత కొన్ని రోజులుగా పెరుగుతూ, కొద్దిగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరల్లో ఈరోజు భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 200 తగ్గి రూ. 44,600కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 220…