దేశంలో అత్యధికంగా సేల్ అయ్యే వాటిల్లో పుత్తడి కూడా ఒకటి. పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారానికి డిమాండ్ పెరుగుతున్నది. అంతర్జాతీయంగా ధరలు కొంత తక్కువగా ఉన్నప్పటికీ, దేశీయంగా ధరలు పెరుగుతున్నాయి. ఈరోజు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 200 పెరిగి రూ.44,450కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.220 పెరిది రూ.48,490కి చేరింది. పుత్తడి ధరలతో పాటుగా వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. కిలో వెండి ధర రూ. 1000 పెరిగి రూ.66,700కి చేరింది.
Read: వందేళ్లకు కాదు… మరో 60 ఏళ్లలోనే మరో ముప్పు…!!