ఓటుకు నోటు కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చార్జిషీట్‌ను విచారణకు స్వీకరించిన నాంపల్లి ఎంఎస్‌జే కోర్టు… ఈ కేసులో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి సమన్లు జారీ చేసింది… రేవంత్‌రెడ్డితో పాటు.. అప్పటి టీడీపీ.. ఇప్పుడు టీఆర్ఎస్లో ఉన్న ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు కూడా సమన్లు జారీ అయ్యాయి.. ఈడీ కేసులను విచారించే నాంపల్లి ఎంఎస్ జే కోర్టు నుంచి ఈ సమన్లు జారీ అయ్యాయి… అక్టోబరు 4వ తేదీన విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ…
నేడు గ్రేటర్ హైదరాబాద్ లో మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా చంచల్ గూడ లో జీహెచ్ఎంసీ నిర్మించిన 288 డబుల్ బెడ్ రూం ఇళ్లను ప్రారంభించనున్నారు మంత్రి కేటీఆర్. హైద్రాబాద్ ను స్లమ్ ఫ్రీ సిటీగా చేసేందుకు గతంలో మురికివాడగా ఉన్న పిల్లి గుడిసెల బస్తీ… లో రూ. 24.91 కోట్ల వ్యయంతో 9 అంతస్తుల్లో 288 డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మిచింది జీహెచ్ఎంసీ. ఒకటిన్నర ఎకరాలు ఉన్న ఈ స్థలంలో 288 డబుల్…
తీన్మార్ మల్లన్న అరెస్ట్ అయ్యారు. మల్లన్న అలియాస్ చింత పండు నవీన్ ను అర్థరాత్రి అరెస్ట్ చేశారు చిలకలగూడ పోలీసులు. తీన్మార్ మల్లన్న తనను డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ చేశాడని ప్రముఖ జ్యోతిష్య నిపుణులు లక్ష్మీకాంత్ శర్మ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రూ. 30 లక్షలు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసాడని, ఇవ్వక పోయేసరికి తనను బ్లాక్ మెయిల్ చేశాడంటూ ఫిర్యాదు చేశాడు జ్యోతిష్య నిపుణులు లక్ష్మీకాంత్ శర్మ. ఈ మేరకు ఇప్పటికే తీన్మార్ మల్లన్న…
ప్రపంచంలోనే అత్యంత విలువైనది బంగారం. అయితే.. కొన్ని రోజులుగా బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. కరోనా నేపథ్యంలో పసిడి ధరలు పెరుగుతున్నాయని నిపుణులు అంటున్నారు. అయితే గత వారం రోజుల నుంచి బంగారం ధరలు భారీగా పెరుగుతూ వస్తున్నాయి. ఈరోజు పెరిగిన ధరల ప్రకారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 200 పెరిగి రూ. 44,400 కి చేరింది. ఇక 10 గ్రాముల…
ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టు జడ్జి జస్టిస్ సీహెచ్వీఆర్ఆర్ వరప్రసాద్ ను తెలంగాణ ఉన్నత న్యాయస్థానం బదిలీ చేసింది. ఈ మేరకు శుక్రవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం సీబీఐ స్పెషల్ కోర్టు-1 అదనపు జడ్జిగా వరప్రసాద్ కు బాధ్యతలు అప్పగించింది న్యాయస్థానం… ఇక, ఎంపీ, ఎమ్మెల్యేల కేసుల కోర్టు న్యాయమూర్తిగా కె.జయకుమార్ ను నియమించింది. జస్టిస్ జయకుమార్ ప్రస్తుతం వరంగల్ ఒకటో అదనపు జిల్లా సెషన్స్ కోర్టు జడ్జిగా విధులు నిర్వహిస్తున్నారు.. మరోవైపు.. తెలంగాణ…
సైబర్ నేరగాళ్ల మోసాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. సైబర్ మోసాలను అరికట్టేందుకు ఇప్పటికే పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. అయితే ట్విట్టర్ లో ఓ యాడ్ చూసి.. 14 లక్షల సైబర్ మోసానికి ఓ యువకుడు బలైపోయాడు. హైదరాబాద్ దిల్ సుఖ్ నగర్ కి చెందిన రాహుల్ ను ట్విట్టర్ లో ఓ యాడ్ ఆకర్షించింది. నీల్ పటేల్ అనే ట్విట్టర్ అకౌంట్ లో ఈ యాడ్ చూసి.. అధిక లాభాలు వస్తాయని 14 లక్షల క్రిప్టో కరెన్సీ…
తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఎంఎస్ రామచంద్రరావు నియమితులయ్యారు. ఇప్పటి వరకు తెలంగాణ హైకోర్టు సీజేగా ఉన్న జస్టిస్ హిమా కోహ్లీ పదోన్నతిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బదిలీ కావడంతో.. హైకోర్టు సీజే పోస్టు ఖాళీ ఏర్పడింది.. దీంతో.. ఎంఎస్ రామచంద్రరావును తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా నియమిస్తూ గెజిట్ విడుదల చేసింది కేంద్ర న్యాయశాఖ. తెలంగాణ హైకోర్టుకు పూర్తిస్థాయిలో కొత్త ప్రధాన న్యాయమూర్తి వచ్చే వరకు.. బాధ్యతలు నిర్వహించనున్నారు ఎంఎస్ రామచంద్రరావు. కాగా, సుప్రీంకోర్టుకు కొత్తగా 9…
మంత్రి మల్లారెడ్డి రాజీనామా సవాల్ చివరకు సీఎం కేసీఆర్ పైకి మళ్లింది… గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడిన పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి.. మల్లా రెడ్డిపై మరోసారి భూ కబ్జా, అవినీతి, అక్రమ ఆరోపణలు చేశారు.. ఈ సందర్భంగా ఇవిగో ఆధారాలంటూ కొన్ని పత్రాలను కూడా బయటపెట్టారు.. ఇక, ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి రాజీనామా సవాల్‌పై స్పందించిన ఆయన.. సవాల్ మల్లారెడ్డికి కాదు.. కేసీఆర్‌కే విసురుతున్నా అన్నారు.. నేను గెలిచిందే మల్లారెడ్డి మీద కదా? అని ప్రశ్నించారు..…
మొన్న మంత్రి మల్లారెడ్డిపై భూ కబ్జా ఆరోపణలు చేసిన టి.పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి.. ఇవాళ వాటికి సంబంధించిన ఆధారాలంటూ కొన్ని పత్రాలను మీడియా ముందు బయటపెట్టారు.. సహచరులపై అవినీతి ఆరోపణలు వస్తే చర్యలు తీసుకుంటానని సీఎం కేసీఆర్ చెప్పారన్న ఆయన.. అవినీతి ఆరోపణలు వస్తే ఉపేక్షించనని గతంలో ఇద్దరు మంత్రులపై వేటు కూడా వేశారని గుర్తుచేశారు. మంత్రి మల్లారెడ్డిపై చాలా అవినీతి ఆరోపణలు ఉన్నాయన్న రేవంత్.. తాను మల్లారెడ్డి అవినీతిపై ఆధారాలిచ్చానని పేర్కొన్నారు. ఓ రియల్ ఎస్టేట్…