తల్లిదండ్రులు ఎవరైనా తాము కష్టాలు అనుభవిస్తున్నా తమ బిడ్డలు మాత్రం సంతోషంగా ఉండాలని చూస్తారు.. ఎన్ని కష్టాలు ఎదుర్కొని అయినా వారికి అన్నం పెడతారు.. కానీ, ఇక్కడ మనం చెప్పుకోబోయే తల్లిదండ్రులు మాత్రం అందుకు విరుద్ధం .. వీరుచేసిన పని వింటే తల్లిదండ్రులకే మాయని మచ్చ తెచ్చారు అంటారు.. కన్నా కూతుర్ని కంటికి రెప్పలా కాపాడిల్సినవారు ఆమెను బలవంతంగా వ్యభిచారంలోకి దింపారు.. ఆమెకు ఇష్టంలేదని చెప్తే బలవంతంగా ఆమెను బెదిరించి ఈ రొంపిలోకి దించిన వారిని ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ దారుణ ఘటన హైదరాబాద్ లో వెలుగుచూసింది.
వివరాల్లోకి వెళితే.. బంజారాహిల్స్ రోడ్ నం. 2లోని ఇందిరానగర్‌లో లో ఓ 16 ఏళ్ల బాలిక భిక్షాటన చేస్తోంది.. ఇక భిక్షాటన చేస్తోన్న బాలికను చూసిన కొంతమంది చైల్డ్‌లైన్ 1098కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అధికారులు అక్కడికి వెళ్లిచూడగా బాలిక కనిపించలేదు.. గత రెండు రోజులుగా బాలికను వెతుకుతున్న అధికారులకు తాజాగా ఆమె ఖమ్మంలో భిక్షాటన చేస్తూ కనిపించింది. దీంతో బాలికను చైల్డ్‌లైన్ కో–ఆర్డినేటర్ వేదాల సాల్మన్‌రాజు కాపాడి తీసుకురాగా ఆమె చెప్పిన విషయాలు విన్న అందరూ ఖంగుతిన్నారు. చిన్నప్పటినుంచి తన తల్లిదండ్రులే భిక్షాటన చేయమని చెప్పారని, అంతేకాకుండా తనతో తన తల్లి వ్యభిచారం కూడా చేయిస్తుందని, బలవంతంగా శృంగారం చేయాలని బెదిరిస్తుందని తెలిపింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలికను చైల్డ్‌లైన్ సెంటర్ కి పంపించి తల్లిదండ్రులపై కేసునమోదు చేసి , వారికోసం గాలిస్తున్నారు