చేనేత కార్మికులకు కోసం మోదా టెక్నాలజీ సరికొత్త యంత్రం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చేనేత కార్మికులు పడుతున్న కష్టాలను తగ్గించేందుకు మోదా టెక్నాలజీ వారు సరికొత్త యంత్రాన్ని రూపొందించారు. చేనేత పరిశ్రమ అత్యంత శ్రమతో ముడిపడి ఉంది. చేనేత కార్మికులు జాక్వర్డ్ అటాచ్‌మెంట్‌ను ఆపరేట్ చేయడానికిశారీరకంగా శ్రమించవలసి ఉంటుంది. ఇది మగ్గాలు క్లిష్టమైన నమూనాలతో బట్టలను ఉత్పత్తి చేయడానికి శ్రమపడాల్సి ఉంటుంది. అయినప్పటికీ జాక్వర్డ్ హ్యాండ్లూమ్లతో పనిచేసేటప్పుడు నేత కార్మికులు పలు సమస్యలను ఎదుర్కొంటారు, జాక్వర్డ్ బాక్స్ హెవీవెయిట్ కారణంగా, మొత్తం మగ్గం యంత్రాన్ని నేత కార్మికులు కదపాల్సి ఉంటుంది.
నేత కార్మికులు తమ కాళ్లు,చెక్క మీటను ఉపయోగించి దీన్ని ఎత్తుతారు. మొత్తం సెటప్ 40 కిలోల బరువు ఉంటుంది. డిజైన్ ఎంత క్లిష్టంగా ఉంటే అంత ఎక్కువ లిఫ్టులు అవసరమవుతాయి. పదేపదే కదలికలు, బరువు నేత కార్మికులను ఒత్తిడికి గురి చేస్తుంది. వీరి కష్టాన్ని తగ్గించి సులభతరంగా నేతన్నలు పనులు చేసుకునేలా సరికొత్త యంత్రాన్ని రూపొందించారు. శివ కుమార్ చేత స్థాపించిన బాలంగర్ మోధా టెక్నాలజీస్ వారు.
Also Read
- Arnab Cyclone-School Holiday: తెలంగాణలోనూ తుఫాను ప్రభావం.. ఈ జిల్లాలో స్కూళ్లు, కాలేజీలకు సెలవు..
- Hyderabad: తెలంగాణకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా రాక.. హైదరాబాద్‌లో బీజేపీ మహా పాదయాత్ర..
- Drought Affected Mandals: తెలంగాణలో 365 కరవు మండలాలను ప్రకటించిన ప్రభుత్వం.. మీ మండలం ఈ జాబితాలో ఉందా?
- ACB Raids : మీర్‌చౌక్ ఇన్స్పెక్టర్కు ఏసీబీ షాక్.. రూ.3 లక్షలు తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కారు
మోదా ప్రత్యేకతలు ఇవే..
నేత కార్మికులకు కష్టాలను తగ్గించేందుకు శివకుమార్ దీనికి పరిష్కారం కనుగొన్నారు. మరమగ్గాలకు ఎలాంటి మార్పులు, చేర్పులు లేకుండా అన్ని మగ్గాలపై దీన్ని ఉపయోగించవచ్చు. ఇది పిట్ లూమ్‌లకు కూడా సరిపోతుంది. ఇది పిట్లో సరిపోతుంది, నేత పెడల్స్ ద్వారా రగ్గును తయారు చేస్తారు. “వివిధ రకాల మగ్గాలకు ఈ యంత్రాన్ని ఉపయోగించుకోవచ్చు. ఇది ఒకే నేత, సాదా నేత బట్టలకు ఏకకాలంలో అచ్చులు మరియు జాక్వర్డ్లు రెండింటినీ కలిపి లాగవచ్చు. ఇది రెండు జాక్వర్డ్లను విడిగా లేదా ఏకకాలంలో ఎత్తడానికి ఉపయోగించుకోవచ్చు.
అందుబాటులో ధర..
ఈ యంత్రం ధరను ప్రాథమికంగా రూ. 16,000గా అంచనా వేస్తున్నామని, ఈ యంత్రానికి సంబంధించిన టెక్నాలజీకి సంబంధించి మా వద్ద పేటెంట్ ఉందని శివకుమార్ తెలిపారు. యంత్రాన్ని ఉపయోగించడం వల్ల చేనేత కార్మికులకు శారీరక శ్రమ, ఒత్తిడికి గురికారు. బరువులు ఎత్తడమే కాకుండా వేగాన్ని పెంచేందుకు కూడా ఇది ఉపయోగపడుతుందని శివకుమార్ వెల్లడించారు. మాన్యువల్ లేబర్ గణనీయంగా తగ్గినందున దీనికి మంచి డిమాండ్ ఉందని ఆయన చెప్పారు. Modha Technologies తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అట్టడుగు స్థాయిలో సృజనాత్మకతను ప్రోత్సహించే పల్లె సృజన స్వచ్చంధ సంస్థ సహకారంతో శివకుమార్ ఈ యంత్రాన్ని తీసుకొచ్చారు.
ఇది గ్రామీణ ప్రాంతాలలో విజ్ఞానం, నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడంతోపాటు డాక్యుమెంట్ చేస్తుంది. వీటికి ధృవీకరణ, విలువ జోడింపు, పేటెంట్, రీఇంజనీరింగ్, తయారీ, మార్కెట్ సామర్థ్యం వ్యాపార ఇంక్యుబేషన్ కోసం ఈ సంస్థ మద్దతునిస్తుంది. మోదా ఈ నెలాఖరులో విక్రయాలకు సిద్ధమవుతోంది. కంపెనీ తన కార్మిక-పొదుపు లక్షణాల గురించి వివరించడానికి నేతన్నలు ఉండే ప్రాంతాల్లో ఎక్కువ డెమోలను నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ యంత్రానికి టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తే తన దగ్గర టెక్నీషియన్స్ టీమ్ రెడీగా ఉంది. యూనిట్ ఒక సంవత్సరం వారంటీతో వస్తుందని శివకుమార్ తెలిపారు.
తాజావార్తలు
-
SCO Civilisational Dialogue Forum: ఆపరేషన్ సిందూర్ తర్వాత కీలక పరిణామం.. SCO సమావేశానికి పాక్ మంత్రికి భారత్ ఆహ్వానం!
-
Cyclone Arnab: ఉప్పాడ తీరంలో రాకాసి అలల బీభత్సం.. 30 ఇళ్లు నేలమట్టం, కాకినాడ బీచ్ రోడ్డు ధ్వంసం!
-
ఐఫోన్‌కు పోటీగా vivo కొత్త ఫీచర్.. Apple ఎకోసిస్టమ్‌తో VIVO X500 సిరీస్ గ్లోబల్ లాంచ్.!
-
Cyclone Arnab: వేలాది ఎకరాల్లో నేలకొరిగిన అరటి, చెరకు తోటలు.. కోట్లలో నష్టం.. కన్నీరుమున్నీరవుతున్న రైతులు!
-
Cyclone Arnab: ‘అర్నబ్’ తుఫాను పేరు వెనుక అసలు కథ ఇదే.. పేరు పెట్టింది మన దేశం కాదు..
ట్రెండింగ్
-
థియేటర్ అనుభవం ఓకే.. కానీ ఆ ధరకు ఎకరం భూమి కొనవచ్చుగా..! 115 అంగుళాల LG QNED evo AI Mini LED TV లాంచ్..
-
లిక్విడ్ కూలింగ్ ఆర్కిటెక్చర్, ప్రెజర్-సెన్స్ ట్రిగ్గర్లు, డైమెన్సిటీ 8400 అల్టిమేట్ ప్రాసెసర్‌తో సరికొత్త సంచలనం Infinix GT 50 Pro లాంచ్.!
-
6000mAh బ్యాటరీ, IP64 రేటింగ్, ఆరేళ్ల అప్డేట్లతో భారత్‌లో Samsung Galaxy A08 విడుదల..!
-
10,000mAh బ్యాటరీ, 1.5K 165Hz OLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్‌తో REDMI K100 లాంచ్..!
-
Bloating Before Periods: పీరియడ్స్ ముందు కడుపు ఉబ్బరంగా ఉంటోందా? ఈ లక్షణాలను లైట్ తీసుకోవద్దు..