Begging Organizer Anil Pawar Arrested By Taskforce Police: హైదరాబాద్‌లో చిన్నపిల్లలు, వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలతో భిక్షాటన చేయిస్తూ.. ఆ డబ్బులతో జల్సాలు చేస్తున్న ఓ యువకుడ్ని వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటక రాష్ట్రం గుల్బర్గా ప్రాంతానికి చెందిన అనిల్ పవార్(28) హైదరాబాద్‌లోని ఫతేనగర్‌లో నివసిస్తున్నాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈజీ మనీకి అలవాటుపడ్డ ఇతడు.. చిన్నపిల్లలు, వికలాంగులు, వృద్ధులు, ఒంటరి మహిళలను ఎంగేజ్ చేసుకొని నగరంలో పలు ప్రధాన కూడలిలలో భిక్షాటన చేయిస్తున్నాడు. ఆ డబ్బుల్లో వారికి కొంత మొత్తం ఇచ్చి, మిగిలిన మొత్తాన్ని తన జల్సాలకు వాడుకోవడం మొదలుపెట్టాడు. ఇన్నాళ్లూ గుట్టుగా ఉన్న ఈ విషయం రీసెంట్‌గా బయడపడింది.
Snake In Cauliflower: క్యాలీఫ్లవర్ లో కట్లపాము.. చూస్తే పై ప్రాణం పైకే పోతుంది
వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు, స్మైల్ ప్రాజెక్ట్ ఎన్జీవోల బృందం కలిసి ఇటీవల కేబీఆర్ పార్క్, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్‌లలో భిక్షాటన చేస్తున్న 23 మందిని అదుపులోకి తీసుకుని విచారించగా.. వాళ్లు షాకింగ్ నిజాలు బయటపెట్టారు. అనిల్ పవార్ అనే వ్యక్తి తమతో ఇలా భిక్షాటన చేయిస్తూ.. ప్రతిరోజు 4500 నుండి 6000 రూపాయల వరకు తమ నుండి వసూలు చేస్తున్నాడని వాళ్లు తెలిపారు. తమకు మాత్రం రోజువారీ కూలీ మాదిరిగా ఒక్కొక్కరికి రూ.200 చెల్లిస్తున్నారని తమ గోడు వెళ్లబోసుకున్నారు. దీంతో.. అధికారులులు రంగంలోకి దిగి, అనిల్ పవార్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద ఉన్న రెండు టూ వీలర్స్‌ను సీజ్ చేశారు. భిక్షాటన చేస్తున్న వారిని ఎన్జీవో హోమ్‌కు తరలించి, నిర్వాహకుడు అనిల్ పవార్‌పై బెగ్గింగ్ యాక్ట్‌పై కేసు నమోదు చేసి.. జూబ్లీహిల్స్ పోలీసులకు అప్పగించినట్లు టాస్క్ ఫోర్స్ డీసీపీ తెలిపారు.
Monsoon : వర్షాకాలంలో రోగాలు రావొద్దంటే.. వీటిని తప్పక తీసుకోవాలి..