కొత్త ప్రభాకర్ రెడ్డికి గజ్వేల్ లో ప్రాథమిక చికిత్స అందించాం.. రక్త స్రావం ఎక్కువ అవుతోంది.. హైదరాబాద్ తీసుకెళ్ళమని డాక్టర్లు చెప్పారు అని చెబుతూ మంత్రి హరీశ్ రావు భావోద్వేగానికి లోనైయ్యారు. అన్నారు. భౌతిక దాడులకు, హత్యా యత్నాలకు దిగడం సరైంది కాదు.. దాడి చేసిన వ్యక్తి ఎవరు... ఎందుకు చేశాడు అనేది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఘట్కేసర్, మహేశ్వరం పోలీసుల బృందం సంయుక్త ఆపరేషన్ నిర్వహించి మాదక ద్రవ్యాల రాకెట్ ఛేదించారు.. ఈ కేసులో డ్రగ్ ఫెడ్లర్ ను అరెస్ట్ చేయడంతో పాటు 710 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ వెల్లడించారు.
Hyderabad: నిన్న ఉదయం హైదరాబాద్ లోని చంపాపేట్ లో జరిగిన స్వప్న అనే యువతీ హత్య కేసు దర్యాప్తును ముమ్మరం చేశారు పోలీసులు. ఈ నేపధ్యంలో సంచలన నిజాలు వెలుగు చూశాయి. హత్యకు ప్రేమ వ్యవహారమే కారణం అంటున్నారు పోలీసులు. వివరాలలోకి వెళ్తే.. స్వప్న కేసును దర్యాప్తు చేసిన పోలీసు అధికారులు మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పోలీసు అధికారుల సమాచారం ప్రకారం.. మృతిచెందిన స్వప్న అనే యువతి గతంలోసతీష్ అనే యువకుడిని ప్రేమించింది. కాగా స్వప్నకు…
Hyderabad: ఐఎస్ సదన్ పోలీస్ స్టేషన్ పరిధి లోని చంపా పేట లోని రాజీ రెడ్డి నగర్ లో దారుణం చోటు చేసుకుంది. ఓ యువతీ హత్య మిస్టరీగా మారింది. వివరాలలోకి వెళ్తే.. చంపా పేట రాజిరెడ్డి నగర్ లోని ఓ ఇంట్లో స్వప్న(24) ప్రేమ్(25) అనే దంపతులు ఉంటున్నారు. కాగా వాళ్ళు నివాసం ఉంటున్న ఇంటికి రోజు గుర్తు తెలియని వ్యక్తులు వస్తూపోతూ ఉండేవాళ్ళు. ఈ నేపథ్యంలో ఇంటి యజమాని కూడా యువతి యువకుడిని పలు…
ఇక్కడ కేసీఆర్ ఉన్నారు? అక్కడ ఎవరు ఉన్నారు? అని మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. ఎవరు ఎన్ని ట్రిక్కులు చేసినా బీఆర్ఎస్ దే హాట్రిక్ అంటూ మంత్రి వెల్లడించారు.
తీవ్రమైన న్యుమోనియా, ఏఆర్డీఎస్తో బాధపడుతూ అత్యున్నత స్థాయి వెంటిలేటర్ మీద ఉన్న గోవాకు చెందిన 18 నెలల పసికందును రక్షించడం ద్వారా రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ అత్యున్నత స్థాయి వైద్య నైపుణ్యం, నిబద్ధతను చాటుకుంది.
Hyderabad: దోపిడీ చేస్తూ పట్టుబడితే పోలీసులకి అప్పగిస్తారు. ఆపై అధికారులు శిక్షిస్తారు. అదే పోలీసు యూనిఫామ్ ఉంటే ఏం చేసిన అడిగే వారు ఎవరు ఉండరు. డ్యూటీ పేరుతో లూటీ చేసిన ఎవరికీ అనుమానం రాదు అనుకుని.. యూనిఫామ్ ముసుగులో ఏం చేసిన చెల్లుతుంది అని పొరపాటు పడిన ఇద్దరు వ్యక్తులు పోలీసుల అవతారం దాల్చారు. డ్యూటీకి దిగి లూటీకి పాల్పడ్డారు. చెకింగ్ పేరుతో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 18 లక్షలను మాయం చేశారు…
తెలంగాణ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ ఫీజు గడువు తేదీలను ఇంటర్ బోర్డు విడుదల చేసింది. అయితే, ఇవాళ్టి నుంచి అనగా ( అక్టోబర్ 26)వ తేదీ నుంచి ఫీజు చెల్లింపు ప్రక్రియ స్టార్ట్ అయి.. నవంబర్ 14వ తేదీ వరకు ఎలాంటి జరిమానా లేకుండా విద్యార్థులు ఫీజును చెల్లించవచ్చని ఇంటర్ బోర్డు వెల్లడించింది.
ఇక నుంచి జంట నగరాల్లో కృష్ణా యూనియన్ పాల ఉత్పత్తులు లభ్యం కానున్నాయి. స్వచ్ఛమైన పాలు, పాల ఉత్పత్తులను విజయ బ్రాండ్ అందుబాటులోకి తీసుకొస్తోంది. ఆరు దశాబ్దాలుగా వినియోగదారులు విశ్వాసం చూరగొంటున్న కృష్ణ మిల్క్ యూనియన్ వారి విజయ పాలు, పెరుగు, పాల ఉత్పత్తులు ఇప్పుడు హైదరాబాద్ నగరంలో లభ్యం కానున్నాయి.